Monday, December 23, 2024

ఇంట్లోనే ఉరేసుకున్న ఎస్‌ఐ

- Advertisement -
- Advertisement -

చెన్నై: ఓ ఎస్‌ఐకు అనారోగ్య సమస్యలు చుట్టుముట్టాయి. దీంతో జీవితంపై విరక్తి చెందిన తన ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన తమిళనాడు రాష్ట్రం తిరువల్లూరు జిల్లా కాకలూరు ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… బైపాస్ రోడ్డులో తనిగవేలు(49) భార్య, ఇద్దరు కూతుళ్లతో సంతోషంగా ఉంటున్నాడు. తిరువళ్లూరు పోలీస్ స్టేషన్‌లో ఎస్‌ఐగా విధులు నిర్వహిస్తున్నారు. గత కొన్ని రోజుల నుంచి అనారోగ్య సమస్యలు తలెత్తడంతో విధులు కూడా సరిగా నిర్వర్తించలేకపోతున్నాడు. శనివారం విధులకు హాజరై రాత్రి ఇంటికి వచ్చాడు. భోజనం చేసిన తరువాత తన గదిలోకి వెళ్లి పడుకున్నాడు. ఆదివారం ఉదయం ఎనిమిది గంటల వరకు తన భర్త బయటకు రాకపోవడంతో తలుపు తెరిచి భార్య చూసింది. ఉరేసుకొని కనిపించడంతో ఒక్కసారిగా శోకసంద్రంలో మునిగిపోయింది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని తిరువళ్లూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనారోగ్య సమస్యలు తలెత్తడంతో ఆత్మహత్య చేసుకొని ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.

Also Read: వస్త్రాల దొంగతనం?…. కట్టేసి కొట్టి చంపారు… (వీడియో వైరల్ )

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News