Monday, December 23, 2024

నేటి నుంచి 500 మద్యం దుకాణాలు మూసివేత

- Advertisement -
- Advertisement -

చెన్నై : తమిళనాడులో ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ మద్యం దుకాణాలు 5329 లో 500 రిటైల్ షాపులను గురువారం (జూన్ 22) నుంచి మూసివేస్తున్నారు. రాష్ట్ర ఎక్సైజ్ మంత్రిగా ఉన్న సెంథిల్ బాలాజీ అసెంబ్లీ సమావేశాల్లోనే ఏప్రిల్ 12 న ఈ నిర్ణయాన్ని ప్రకటించారు.

(మంత్రి బాలాజీని ఈడీ ఇటీవలనే అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.) ఆ మేరకు ఇప్పుడు అమలు చేస్తున్నారు. అప్పటి ప్రకటనను గుర్తుకు తెస్తూ తమిళనాడు స్టేట్ మార్కెటింగ్ కార్పొరేషన్ (టిఎఎస్‌ఎమ్‌ఎసి) ముఖ్యమంత్రి స్టాలిన్ మార్గదర్శకాల ప్రకారం ఏప్రిల్ నాటి ప్రభుత్వ ఉత్తర్వు జారీ చేయడమైందని వివరించారు. దీనిపై గుర్తించిన 500 రిటైల్ షాపులు ఈ నెల 22 నుంచి పనిచేయవని పేర్కొన్నారు.

ఈ చర్యను విపక్షం పట్టలి మక్కలి కచ్చి (పిఎంకె) స్వాగతించింది. మిగతా షాపులను కూడా నిర్ణీత సమయంలో మూసివేయాలని డిమాండ్ చేసింది. మద్యపాన నిషేధాన్ని దశల వారీగా అమలు చేస్తామని ముఖ్యమంత్రి స్టాలిన్ హామీ ఇచ్చారని, ఇప్పుడు 500 షాపులు మూసివేయడం నాంది కావాలని పిఎంకె అధ్యక్షుడు , ఎంపి డాక్టర్ అంబుమణి రాందాస్ ట్వీట్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News