చెన్నై: పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్‌కు మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ ఇచ్చిన గురువు కన్నుమూశారు. ప్రముఖ కోలివుడ్ నటుడు షిహాన్ హుసైని(60) బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. ఆయన చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందతున్నారు. మంగళవారం ఆయన బిసెంట్ నగర్‌లో ఉన్న స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆయన కుటుంబసభ్యులు సోషల్‌మీడియా ద్వారా వెల్లడించారు.
1986లో కె బాలచందర్ దర్శకత్వంలో వచ్చిన ‘పున్నగై మన్నన్’ సినిమా ద్వారా హుసైని తమిళ చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టారు. ఆ తర్వాత ఆయన పలు తమిళ చిత్రాల్లో నటించారు. విజయ్ నటించిన ‘బద్రి’ సినిమాతో ఆయనకు మంచి గుర్తింపు వచ్చింది. అంతేకాక 1988లో హాలీవుడ్ ప్రొడక్షన్ బ్లడ్‌స్టోన్‌కి కూడా ఆయన పని చేశారు. పవన్‌కళ్యాణ్‌కు మార్షల్ ఆర్ట్స్‌తో పాటు.. కిక్ బాక్సింగ్, కరాటేలో కూడా హుసైనీ శిక్షణ ఇచ్చారు. ఆర్చరీలో కూడా ఆయన 400 మంది విద్యార్థులకు శిక్షణ అందించారు. ఆయన మృతదేహాన్ని మెడికల్ రీసెర్చ్ కోసం దానం చేశారు. హుసైని మృతిపై పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.