Wednesday, January 22, 2025

రష్యాకు వ్యతిరేకంగా పోరాడుతున్న తమిళ యువకుడు!

- Advertisement -
- Advertisement -

చెన్నై: రష్యా భీకరంగా దాడిచేస్తుంటే చాలా మంది ఉక్రెయిన్ వదిలి పోయారు. కానీ తమిళనాడుకు చెందిన 21 ఏళ్ల కుర్రాడు మాత్రం ఉక్రెయిన్ తరఫున పోరాడుతున్నాడు. ఈ విషయాన్ని నిఘా వర్గాలు కేంద్ర ప్రభుత్వానికి సమాచారం ఇచ్చాయి. ఆ యువకుడి పేరు సైనికేశ్ రవిచంద్రన్. అతడు తమిళనాడులోని కోయంబత్తూరులో తుడలియార్ చెందినవాడు. అతడు ఉక్రెయిన్‌లోని ఖార్కివ్ నేషనల్ యూనివర్శిటీలో ఏరోస్పేస్ ఇంజనీరింగ్ చదువుతున్నాడు. దీనికి ముందు అతడు భారత సైన్యంలో చేరడానికి ప్రయత్నించగా రెండుసార్లు తిరస్కరణకు గురయ్యాడు. అతడి ఎత్తే అడ్డంకిగా మారింది. దాంతో అతడు 2018లో ఉన్నత విద్యాభ్యాసం కోసం ఉక్రెయిన్ వెళ్లాడు. ప్రస్తుతం అతడు ఉక్రెయిన్ తరఫున పోరాడుతున్న విషయం అతడి తల్లిదండ్రులకు తెలియదు. నిఘా విభాగానికి చెందిన అధికారులు వచ్చి చెప్పడంతో వారు ఆశ్చర్యపోయారని తమిళనాడు పోలీసు వర్గాలు తెలిపాయి. అతడికి సైన్యంలో పనిచేయడం అంటే ఇష్టమని అధికారులు గుర్తించారు. ప్రస్తుతం సైనికేశ్ రవిచంద్రన్ జార్జియన్ నేషేనల్ లీజియన్ పారామిలిటరీ యూనిట్ తరఫున పోరాడుతున్నాడు. అది వాలంటీర్లతో కూడిన యూనిట్. ఇదిలావుండగా అతడి తల్లిదండ్రులు అతడిని సురక్షితంగా స్వదేశానికి తీసుకురావాలని అధికారుల్ని కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News