Monday, December 23, 2024

కొత్త పార్టీ పెట్టిన తమిళ సూపర్ స్టార్

- Advertisement -
- Advertisement -

తమిళ సూపర్ స్టార్ విజయ్ పొలిటికల్ ఎంట్రీ ఖరారైంది. ఆయన శుక్రవారం తమిళిగ వెట్రి కళగం పేరిట పార్టీని పెడుతున్నట్లు ప్రకటించారు. రాజకీయ మార్పు కోసం తమిళనాడు తహతహలాడుతోందని, ప్రజలు మార్పును కోరుకుంటున్నారని విజయ్ అన్నారు. రాజకీయ అధికారంతోనే ఈ మార్పును తీసుకువచ్చే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. రానున్న లోక్ సభ ఎన్నికల్లో కాకుండా 2026లో జరిగే అసెంబ్లీ ఎన్నికలతో బరిలోకి దిగాలన్నది విజయ్ వ్యూహంగా కనిపిస్తోంది.

రజనీకాంత్, కమల హాసన్ ల దారిలోనే అగ్రశ్రేణి నటుడిగా పేరుతెచ్చుకున్న విజయ్ కు లక్షలాది మంది అభిమానులు ఉన్నారు. పేద ప్రజలకు అడపాదడపా సాయం అందిస్తూ తమిళనాడులో ఎంతో పేరు తెచ్చుకున్నారు. కొంతకాలంగా ఆయన రాజకీయ ప్రవేశం గురించి వార్తలు వెలువడుతూనే ఉన్నాయి. కాగా శుక్రవారం పార్టీ పేరును ప్రకటించడంతో ఆయన అభిమానులు హర్షధ్వానాలు వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News