Monday, December 23, 2024

రోడ్డు ప్రమాదంలో ప్రియుడు చనిపోయాడని… ప్రియురాలు ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

 

చెన్నై: రోడ్డు ప్రమాదంలో ప్రియుడు దుర్మరణం చెందడంతో ప్రియురాలు మానసిక వేదనతో ఆత్మహత్య చేసుకున్న సంఘటన తమిళనాడు రాష్ట్రం తిరువళ్లూరు జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… వినోదిని(22) ఎంబిఎ చదువుతూ గత మూడేళ్ల నుంచి వసంత్‌ను(23) గాఢంగా ప్రేమిస్తోంది. పది రోజుల క్రితం వసంత్ రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. ప్రియుడి మృతి చెందినప్పటి నుంచి ఆమె ఒంటరిగా జీవిస్తోంది. ప్రియుడు లేని జీవితం వృధా అనుకోని ఇంట్లో ఉరివేసుకుంది. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News