Wednesday, January 22, 2025

రెండేళ్లుగా ఆరోగ్యశాఖ నాకు అందుబాటులో లేదు: గవర్నర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రెండేళ్లుగా ఆరోగ్యశాఖ అధికారులు తనకు అందుబాటులో లేరని తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందర్‌ రాజన్‌ పేర్కొన్నారు. కిమ్స్ కడిల్స్ ఉమెన్ హెల్త్ కార్యక్రమంలో గవర్నర్ తమిళిసై పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ…. అవరోధాలను అవకాశాలుగా మార్చుకోవడమే తన బలం అన్నారు. తెలంగాణలోనే ఎన్నో అవరోధాలు ఎదుర్కొంటున్నా.. అవరోధాలన్నింటినీ దాటగలుగుతున్నానని ఆమె వెల్లడించారు. మహిళలు తమ సమస్యలు బయటకు చెప్పడానికి ముందుకు రావాలని గవర్నర్ పిలుపునిచ్చారు. లైంగిక వేధింపులపై ఆడపిల్లలకు బాల్యం నుంచి అవగాహన కల్పించాలని తమిళిసై సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News