హైదరాబాద్ : రక్షణ, ఆరోగ్య రంగాల్లో రోబోటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గొప్ప మార్పులను తెచ్చాయని గవర్నర్ డా. తమిళిసై సౌందరరాజన్ అన్నారు. హైదరాబాద్‌లోని మిలిటరీ కాలేజ్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్, మెకానికల్ ఇంజినీరింగ్‌లో ఏర్పాటు చేసిన రోబోథాన్-2021, ఇంటర్ కాలేజ్ రోబోటిక్స్ పోటీల్లో గవర్నర్ ప్రారంభోపన్యాసం చేశారు. రోబోటిక్స్‌లోని ఆవిష్కరణలు మన దేశానికి ప్రయోజనం చేకూర్చే అపారమైన సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయన్నారు. రోబోటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, మెషిన్ లెర్నింగ్ వంటి అభివృద్ధి చెందుతున్న రంగాల్లో అగ్రగామిగా ఉండటానికి ఇది సరైన సమయం అన్నారు. అనేక రంగాల్లో సాంకేతికతలో వేగంగా అభివృద్ధి చెందడంతో అందుకు అనుగుణంగా భారత సైన్యం వేగాన్ని కొనసాగించాలన్నారు. రోబోథాన్-2021లో ప్రదర్శించబడిన వినూత్నమైన రోబోటిక్ మోడల్స్‌ను గవర్నర్ పరిశీలించారు. కార్యక్రమంలో లెఫ్టినెంట్ జనరల్ టిఎస్‌ఎ నారాయణన్, సిఇఒ రాజేందర్‌సింగ్, కమాండెంట్ , కల్నల్ కమాండెంట్, సీనియర్ సైనిక అధికారులు, ఫ్యాకల్టీ సభ్యులు పాల్గొన్నారు.
సాంకేతికతో ఆరోగ్య, రక్షణ రంగాల్లో గొప్ప మార్పులు
- Advertisement -
- Advertisement -
- Advertisement -