Monday, December 23, 2024

చెన్నై సౌత్ నుంచి తమిళిసై పోటీ

- Advertisement -
- Advertisement -

లోక్‌సభ బరిలో రాష్ట్ర మాజీ గవర్నర్

బిజెపి మూడో జాబితాలో చోటు
బుధవారం నాడే పార్టీ తీర్థం పుచ్చుకున్న తమిళి సై

మన తెలంగాణ/హైదరాబాద్: భారతీయ జనతా పార్టీ లోక్‌సభ ఎన్నికల అభ్యర్థుల మూడో జాబితాను గురువారం విడుదల చేసింది. అందులో తమిళనాడుకు సంబంధించి 9 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. తెలంగాణ మాజీ గవర్నర్ తమిళి సై సౌందర రాజన్‌ను చెన్నై సౌత్ పార్లమెంటు నుంచి బరిలో దించింది. ఇటీవల తెలంగాణ గవర్నర్ పదవితో పాటు పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ పదవికి తమిళి సై రాజీనామా చేసింది. మరుసటి రోజు చెన్నైలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, ఆ రాష్ట్ర బిజెపి అధ్యక్షు డు అన్నామలై ఆధ్వర్యంలో తిరిగి కమలంలో చేరి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. ప్రజాసేవ చేసేందుకే తాను తిరిగి ప్రత్యక్ష రాజకీయా ల్లో అడుగు పెట్టినట్లు పేర్కొన్న ఆమెకు బిజెపి హైకమాండ్ ఈ ఎన్నికల్లో చెన్నై సౌత్ నుంచి పోటీ చేసే అవకాశం కల్పించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News