Sunday, December 22, 2024

ఆ పోలింగ్ కేంద్రంలో రీ పోలింగ్ జరపండి : తమిళసై డిమాండ్

- Advertisement -
- Advertisement -

చెన్నై: సౌత్ చెన్నై నియోజకవర్గం లోని 122 వ వార్డు 13 నెంబర్ పోలింగ్ కేంద్రంలో రీ పోలిగ్ జరపాలని ఆ నియోజక వర్గం బీజేపీ అభ్యర్థి డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ డిమాండ్ చేశారు. ఆమేరకు పార్టీ ప్రతినిధులతో కలిసి ఎన్నికల రిటర్నింగ్ అధికారి అమిత్‌కు వినతి పత్రం సమర్పించారు. శుక్రవారం పోలింగ్ జరుగుతుండగా, మైలాపూర్ శాసనసభ నియోజకవర్గం పరిధిలో ఉన్న 122 వ వార్డు ఆస్టిన్ నగర్‌లోని 13 వ నెంబర్ పోలింగ్ కేంద్రంలో సాయంత్రం 5.30 గంటల సమయంలో ప్రభు, అరుణ్ సహా 50 మంది చొరబడి బీజేపీ ఏజెంట్లు గోవింద్ సహా పలువురిపై దాడి చేసి తరిమికొట్టి బూత్ స్వాధీనం చేసుకుని నకిలీ ఓట్లు వేశారని ఆరోపించారు.

13,15,17 నెంబర్ పోలింగ్ కేంద్రాల్లోనూ ఆ దుండగులు ఉదయం నుంచే నకిలీ ఓట్లు వేసినట్టు తమిళిసై ఆరోపించారు. ఇక చోళింగనల్లూరు ప్రాంతంలో వందల సంఖ్యలో ఓటర్ల పేర్లు తొలగించినట్టు తమ పరిశీలనలో వెల్లడైందన్నారు. టి. నగర్ లోని 199, 200,201 , 202వార్డుల్లోనూ వేల సంఖ్యల ఓటర్ల పేర్లను తొలగించారని ఆమె తెలియజేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News