Monday, December 23, 2024

బిజెపి స్టార్ క్యాంపెయినర్‌గా తెలంగాణకు తమిళిసై

- Advertisement -
- Advertisement -

రాష్ట్ర మాజీ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ మరోసారి రాష్ట్రానికి రానున్నారు. గతంలో ఇక్కడ గవర్నర్‌గా పనిచేసిన ఆమె ప్రస్తుతం బిజెపి స్టార్ క్యాంపెయినర్‌గా తమ అభ్యర్థుల ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు వస్తున్నారు. ఎన్నికల సంఘా నికి బిజెపి ఇచ్చిన 40 మంది స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో తమిళిసై పేరు కూడా ఉంది. తమిళిసైతో పాటు అన్నామలై, కుష్బూ, సుందర్, రాధిక శరత్ కుమార్, తేజస్వి సూర్య, రాజాసింగ్, యోగి ఆదిత్యనాథ్, నిర్మలా సీతారామన్ పేర్లను తెలంగాణ స్టార్ క్యాంపెయినర్లుగా రానున్నారు. ఇలా 40 మందితో కూడిన జాబితాను ఎన్నికల సంఘానికి బిజెపి అందించింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News