హైదరాబాద్: భారతదేశంలో మొట్టమొదటిసారిగా రోబోటిక్ గైనకాలజికల్ సర్జరీపై నిర్వహిస్తోన్న జాతీయ సదస్సు రోబోగైన్ ఇండియా 2022ను నేడు హైదరాబాద్‌లో తెలంగాణ రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళసై సౌందరరాజన్ ప్రారంభించారు. రోబోటిక్ గైనకాలజికల్ సర్జరీలను చేస్తోన్న సర్జన్స్‌తో ఏర్పడిన జాతీయ సంస్థ అసోసియేషన్ ఆఫ్ గైనకాలజికల్ రోబోటిక్ సర్జన్స్ (ఏజీఆర్‌ఎస్) ఇప్పుడు మినిమల్లీ ఇన్వాసివ్ కేర్ మరియు రోబోటిక్ అసిస్టెడ్ సర్జరీ (ఆర్‌ఏఎస్)లో అంతర్జాతీయంగా సాంకేతిక అగ్రగామి ఇంట్యుటివ్ సర్జికల్ తో భాగస్వామ్యం చేసుకుని మొట్టమొదటిసారిగా జాతీయ సదస్సును భారతదేశంలో రోబోటిక్ గైనకాలజికల్ సర్జరీపై చేసింది. ఈ రెండు రోజుల సదస్సును రోబోగైన్‌ఇండియా శీర్షికన నిర్వహించారు. స్త్రీ జననేంద్రియ (గైనకాలజికల్) సమస్యలకు చికిత్స చేయడంలో వచ్చిన తాజా సాంకేతికతలు, వాటి వినియోగం పట్ల రెసిడెంట్స్‌తో పాటుగా సర్జన్లకు మెరుగైన అవగాహన కల్పించడమే లక్ష్యంగా దీనిని నిర్వహించారు. ఈ సదస్సును హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో నిర్వహించారు. ఇది జాతీయ మరియు అంతర్జాతీయ ఫ్యాకల్టీతో సంభాషించే వినూత్న అవకాశాన్ని సర్జన్లకు అందించడంతో పాటుగా వారి ప్రాక్టీస్‌కు క్లీనికల్‌గా సంబంధితంగా దానిని మలచడంలో అవసరమైన పరిజ్ఞానం పొందారు.
నిర్వాహక బృందం అవిశ్రాంతంగా శ్రమించి సమగ్రమైన మాస్టర్‌క్లాస్ సెషన్స్‌ను రోబోటిక్ గైనకాలజికల్ ప్రొసీజర్స్‌పై నిర్వహించింది. గైనకాలజికల్ సర్జరీలో నలుగురు అంతర్జాతీయ నిష్ణాతులు మరియు సుప్రసిద్ధ భారతీయ సర్జన్లను ఈ సదస్సుకు ఆహ్వానించడం ద్వారా హాజరైన డాక్టర్లకు విస్తృత స్థాయిలో సమాచారం పంచుకునేందుకు అవకాశాలు కల్పించారు. రోబోటిక్ మియోమెక్టోమీ, మాలిగన్సీ కోసం రోబోటిక్ హిస్టెరెక్టోమీ, కాంప్లెక్స్ హిస్టెరెక్టమీ, ఎండోమెట్రియోసిస్ ఎక్స్‌సిషన్ , న్యూరోపెల్వియాలజీ పై మాస్టర్ క్లాస్ సెషన్‌లను నిర్వహించడంతో పాటుగా సవివరమైన కీనోట్స్, ప్యానెల్ చర్చాకార్యక్రమాలను రోబోటిక్ అసిస్టెడ్ సర్జరీ,దాని అప్లికేషన్స్, భవిష్యత్‌పై కీలకోపన్యాసాలనూ అందించారు మరియు ఇన్సూరెన్స్ పాలసీలలో ఆర్‌ఏఎస్‌ను సైతం జోడించింది.
ఈ కార్యక్రమం గురించి రోబోగైన్ ఇండియా ఆర్గనైజింగ్ ఛైర్మన్ మరియు ఏజీఆర్‌ఎస్ ఫౌండర్ ప్రెసిడెంట్ డాక్టర్ రూమా సిన్హా మాట్లాడుతూ ‘‘ ఈ కార్యక్రమానికి హాజరుకావడంతో పాటుగా తమ అమూల్యమైన సందేశాన్ని అందించిన గౌరవనీయ గవర్నర్ డాక్టర్ తమిళసై సౌందర్ రాజన్‌కు ధన్యవాదములు తెలుపుతున్నాము. స్వతహాగా గైనకాలజిస్ట్ కావడం చేత, గవర్నర్ మద్దతు ఖచ్చితంగా భారతదేశంలో మహిళల ఆరోగ్య పరంగా నెలకొన్న ఆందోళనలను అత్యాధునిక సర్జికల్ సాంకేతికతల ద్వారా పరిష్కరించడంలో తగిన సమాచారం మరింత విస్తృతంగా చేరవేసేందుకు మాకు తోడ్పడుతుంది
ప్రపంచంలోనే అగ్రగామి గైనకాలజీ సర్జన్లకు నిలయం ఇండియా. వీరందరినీ ఏకతాటిపైకి తీసుకువచ్చేందుకు ఈ ప్లాట్‌ఫామ్ పరిచయం చేయడం పట్ల మేము చాలా సంతోషంగా ఉన్నాము. ఈ వినూత్న వేదిక ద్వారా, తాజా సాంకేతికతల పట్ల సర్జన్లకు అవగాహన కల్పించడంతో పాటుగా మహిళలకు మరింత మెరుగైన చికిత్సా ఫలితాలను అందించేందుకు ఓ మార్గం మాకు వేయనుంది. రోబోటిక్ అసిస్టెడ్ సిస్టమ్స్ అయినటువంటి డా విన్సీ వంటివి అతి తక్కువ అభ్యాసంలో సంక్లిష్టమైన శస్త్రచికిత్స అవసరమయ్యే గైనకాలజీ రుగ్మతలకు కనీస యాక్సెస్ విధానాన్ని తీసుకోవడానికి సర్జన్‌ను అనుమతిస్తాయి. ఇది క్యాన్సర్ రోగులకు సహాయపడడంతో పాటుగా నిరపాయమైన స్థితికలిగిన రోగులకు సైతంసహాయపడుతుంది. సాధారణంగా భారతీయ మహిళలు తీవ్రమైన నొప్పితో కూడిన బహిష్టులు, ఋతుక్రమ సమయంలో తీవ్రంగా రక్తస్రావం కావడం, ఫైబ్రాయిడ్స్ లేదా ఎండోమెట్రియోసిస్ వంటి సమస్యలతో బాధపడుతుంటారు. అది వారు తమ జీవితంలో భాగమనీ భావిస్తుంటారు. రోబోటిక్ సర్జరీ ఈ మహిళల జీవితాల్లో పెనుమార్పులను తీసుకురానుంది. అతి తక్కువగా హాస్పిటల్‌లో ఉండే అవకాశం అందించడంతో పాటుగా అతి తక్కువగా రక్తం కోల్పోవడం, తక్కువ నొప్పి కలుగుతాయి’’అని అన్నారు
ఈ ఉమ్మడి కార్యక్రమం గురించి మణ్‌దీప్ సింగ్ కుమార్– వైస్ ప్రెసిడెంట్ అండ్ కంట్రీ జీఎం– ఇంట్యుటివ్ ఇండియా మాట్లాడుతూ ‘‘భారతదేశంలో సర్జన్ల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నప్పటికీ, ఆర్‌ఏఎస్ సాంకేతికతను అత్యుత్తమంగా స్వీకరించడం ద్వారా తమ రోగులకు మెరుగైన సేవలనందించాలనుకునే వారి సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతుంది. అధిక సంఖ్యలో ప్రజలకు సేవలనందించేందుకు మరింతగా అవసరాలు కూడా పెరుగుతున్నాయి. ఇది కొన్ని రకాల చికిత్సలలో ఇది మరింత ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. అలాంటి వాటిలో గైనకాలజీ ఒకటి. ఈ అంతరాన్ని పూరించేందుకు మేము స్థిరంగా సర్జన్ కమ్యూనిటీలు మరియు హాస్పిటల్స్‌తో భాగస్వామ్యం చేసుకోవడంతో పాటుగా హెచ్‌సీపీలు మరియు రోగుల సరసన రోబోటిక్ అసిస్టెడ్ సర్జరీవల్ల కలిగే ప్రయోజనాలను గురించి అర్ధం చేసుకునేలా ప్రయత్నాలను వేగవంతం చేశాము. ఈ డ్రైవ్‌లో భాగంగా, రోబోగైన్ ఇండియా సదస్సు కోసం ఏజీఆర్‌ఎస్‌తో భాగస్వామ్యం చేసుకోవడం పట్ల సంతోషంగా ఉన్నాము. ఇది దేశపు ఆరోగ్యసంరక్షణ ల్యాండ్ స్కేప్ మరింత మెరుగుపడేందుకు మద్దతునందించడంతో పాటుగా భారతదేశంలో మరింత మంది మహిళలకు ఆర్‌ఏఎస్ ప్రయోజనాలు చేరువకానున్నాయి’’ అని అన్నారు.
‘‘మహిళల్లో జననేంద్రియ సమస్యలు తీవ్రంగానే ఉంటుంటాయి. మరీ ముఖ్యంగా అల్పాదాయ మరియు మధ్య తరహా ఆదాయాలు కలిగిన దేశాల(ఎల్‌ఎంఐసీలు)లో ఇవి ఎక్కువగా ఉంటాయి. ఎల్‌ఎంఐసీ లలో నిపుణులకు శిక్షణ అందించడం వల్ల వారు ఇతర క్లీనికల్ డిమాండ్స్ నుంచి రక్షిత సమయం పొందడంతో పాటుగా అత్యుత్తమ ప్రాక్టీస్ మార్గదర్శకాలు, ట్రైనీ వాతావరణంలో ఎదుర్కొనే నిర్దిష్టమైన సవాళ్లకు తగిన శిక్షణ, శిక్షణ పొందిన ఇతర నిపుణుల నుంచి ఐసోలేషన్ మరియు సురక్షిత మద్దతు సేవలను పొందవచ్చు. అంతేకాదు, పరిమిత వనరులు కలిగిన వాతావరణంలో ఎల్‌ఎంఐసీలలో శిక్షణకు అధిక ఖర్చవుతుంది. ఈ సవాళ్లను అధిగమించడం కోసం, భారతదేశంలో గైనకాలజిక్ సర్జికల్ సదుపాయాలలో అగ్రగాములుగా దేశంలో మన సర్జన్ల గైనకాలజిక్ శిక్షణ అవసరాలను తీర్చడానికి ఒక వ్యూహాన్ని రూపొందించాము మరియు దాని ఫలితమే రోబోగైన్ ఇండియా’’అని డాక్టర్ రూమా సిన్హా అన్నారు.
ఆర్‌ఏఎస్ గైనకాలజీ సర్జరీ గురించి రోబోగైన్‌ఇండియా జాయింట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ అనుపమ బహదూర్ మాట్లాడుతూ ‘‘గత రెండు దశాబ్దాలలో అత్యుత్తమంగాసర్జికల్ ఆవిష్కరణలు జరిగాయి. దీనికి రోబోటిక్ అసిస్టెడ్ సర్జరీ (ఆర్‌ఏఎస్) కారణం. గణనీయమైన ప్రయోజనాలతో, ఇది సర్జికల్ ప్రాక్టీస్‌ను విప్లవాత్మీకరించింది. నిరూపిత ప్రయోజనాలైనటువంటి తగ్గించబడిన సర్జకల్ ట్రౌమా, కోత వల్ల ఎదురయ్యే సమస్యల తగ్గింపు వంటివి ఉన్నాయి. నూతన వైద్య మరియు సర్జికల్ సాంకేతికతల వల్ల రోగులకు మెరుగైన ప్రయోజనాలు కలిగే అవకాశాలున్నాయి. గైనకాలజీలో అత్యాధునిక శస్త్రచికిత్స సాంకేతికతలకు సంబంధించిన సమాచారం మా సర్జన్లకు తెలిపేందుకు అనువైన వేదికను రూపొందించినందుకు మేము సంతోషిస్తున్నాము’’ అని అన్నారు.
భారతదేశ వ్యాప్తంగా పలు ప్రాంతాల నుంచి 100 మంది సర్జన్లు, రెసిడెంట్లు ఈ రెండు రోజుల సదస్సులో భాగమయ్యారు. రాబోయే సంవత్సరాలలో కూడా ఈ సదస్సులను నిర్వహించాలని ఆర్గనైజింగ్‌కమిటీ ప్రణాళిక చేస్తుంది. దీనితో పాటుగా ఏజీఆర్‌ఎస్ ఇప్పుడు లైవ్ రోబోటిక్ అసిస్టెడ్ సర్జరీ సెషన్‌లను రాబోయే నెలల్లో దేశవ్యాప్తంగా నిర్వహించడానికి ప్రణాళిక చేసింది.
Tamilisai launches Robo Gyn in India 2022