హైదరాబాద్: గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ శుక్రవారం కోవిడ్ వ్యాక్సిన్ మొదటి డోస్ తీసుకున్నారు. పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న డాక్టర్ తమిళిసై పుదుచ్చేరిలోని రాజీవ్‌గాంధీ ఆసుపత్రిలో కోవీషీల్డ్ వ్యాక్సిన్ మొదటి డోసును తీసుకున్నారు. వ్యాక్సిన్ తీసుకోవడం గర్వంగా ఉందని, అర్హులందరూ వ్యాక్సిన్ తీసుకుని కోవిడ్ రహిత భారత్‌గా మన దేశాన్ని తీర్చిదిద్దాలని కోరారు. పుదుచ్చేరిలో శుక్రవారం మహిళలకు ప్రత్యేకమైన కోవిడ్ వ్యాక్సినేషన్ సెంటర్‌ని లెఫ్టినెంట్ గవర్నర్ హోదాలో డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ ప్రారంభించారు. ఈ సందర్భంగానే తను కూడా మొదటి డోసు తీసుకున్నారు. భారతదేశంలో తయారైన వ్యాక్సిన్ తీసుకున్నందుకు గర్వంగా ఉందని, వ్యాక్సిన్ అభివృద్ధి, తయారీ, పంపిణీలో భారత్ ప్రపంచానికి ఆదర్శంగా ఉందని గవర్నర్ తమిళిసై అన్నారు. కోవిడ్ నివారణకి వ్యాక్సిన్ తీసుకోవడంతో పాటు సరైన నివారణ జాగ్రత్తలు పాటించడం కూడా అత్యంత ఆవశ్యకమని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు.
కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న గవర్నర్ తమిళిసై
- Advertisement -
- Advertisement -
- Advertisement -