Wednesday, January 22, 2025

ఎన్నికల్లో 5 సార్లు ఓటమి: మాజీ గవర్నర్ తమిళిసై

- Advertisement -
- Advertisement -

ఎన్నికల్లో ఐదు సార్లు ఓటమిపై తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
తన వద్ద డబ్బులు లేకనే పోటీచేసినా, ఎన్నికల్లో ఓడిపోయానని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం దక్షిణ చెన్నై నియోజక వర్గం నుంచి లోక్‌సభ ఎన్నిక లకు బిజెపి ఆమెకు టికెట్ ఇచ్చింది. చెన్నై సౌత్ నియోజక వర్గంలో తమిళిసై లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఇంటింటి ప్రచారం చేసిన తమిళిసై ఈసారైనా తనకు ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు. ఎన్నికల్లో తాను 5 సార్లు పోటీ చేసినా, డబ్బులు లేక ఖర్చు పెట్టలేదన్నారు. డబ్బులు లేకపోవడంతోనే తాను ఎన్నికల్లో ఓడిపోతూ వచ్చానని తమిళిసై ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఈసారి ఎన్నికల్లో ఎలాగైనా నెగ్గి ప్రధాని మోడీకి తన సీటు గిఫ్ట్ గా ఇస్తానన్నారు. త్వరలో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో బిజెపి గెలవబోతున్న 400 సీట్లలో తన సీటు కచ్చితంగా ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. డబ్బులు లేని కారణంగానే తాను లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడం లేదన్న నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలను బిజెపి నాయకురాలు తమిళిసై సమర్థించారు.

తమిళిసై 2014 నుంచి 2019 సెప్టెంబర్ వరకు తమిళినాడు బిజెపి అధ్యక్షురాలిగా బాధ్యతలు నిర్వర్థించారు. ఆపై 2019 సెప్టెంబర్ నుంచి మార్చి 2024 వరకు తెలంగాణ గవర్నర్‌గా సేవలందించారు. అయితే మరోసారి లోక్‌సభ ఎన్నికల బరిలో నిలిచేందుకు బిజెపి ఆమెకు ఛాన్స్ ఇచ్చింది. దాంతో తెలంగాణ గవర్నర్ పదవికి, పుదుచ్ఛేరి లెఫ్టినెంట్ గవర్నర్ పదవులకు తమిళి సై ఇటీవల రాజీనామా చేశారు. ఇటీవల తిరిగి బిజెపిలో చేరిన తమిళిసైకి అభ్యర్థుల మూడో జాబితాలో అవకాశం లభించింది. మరోవైపు తన వద్ద డబ్బులు లేకనే ఎన్నికల్లో ఓడిపోతున్నానని ప్రచారంలో భాగంగా తమిళిసై స్వయంగా చెప్పడం రాజకీయంగా దుమారం రేపుతోంది. గెలిచే వారంతా డబ్బులు ఉన్నందునే ఎన్నికల్లో గెలుస్తున్నారా? అనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నా యి. ఇదిలా ఉండగా, తమిళిసై అఫిడవిట్ లెక్కల ప్రకారం ఆమె మీద ఉన్న మొత్తం ఆస్తులు రూ. 2.17 కోట్లు ఉన్నాయి. ప్రస్తుతం బ్యాంక్ అకౌంట్‌లో రూ. 50 వేల నగదు ఉంది. తమిళిసైకి రూ.1.57 కోట్ల విలువ చేసే చరాస్తులు ఉన్నాయి. కానీ ఆమె పేరిట ఒక్క కారు లేదని అఫిడవిట్‌లో పేర్కొన్నారు. ఆమె కుమార్తె పేరు మీద 4 కార్లు ఉన్నాయి. తమిళిసై భర్త పేరిట రూ. 3.92 కోట్ల విలువైన చరాస్తులు ఉన్నాయని వెల్లడించారు. .

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News