Monday, December 23, 2024

8 మంది అయ్యప్ప స్వాములు మృతి…

- Advertisement -
- Advertisement -

తమిళనాడు: తమిళనాడులోని థేనిజిల్లా కుములిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 8 మంది అయ్యప్ప స్వాములు మృత్యువాత పడ్డారు. అయ్యప్ప దర్శనం చేసుకుని తిరుగు ప్రయాణమైన అయ్యప్ప భక్తుల వాహనం అదుపు తప్పి దాదాపు 40 అడుగులున్న ఉన్న లోయలోకి దూసుకెళ్లడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 8 మంది చనిపోగా,మరో  ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల సమాచారం మేరకు ఘటన స్థలికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదంలో  గాయపడిన వారిని చికిత్స నిమిత్తం పోలీసులు స్థానిక  ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన వారిలో ఏడేళ్ళ బాలుడు ఉన్నాడు.  మృతదేహలను బయటకి తీసి పోస్ట్ మార్టం నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు.ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News