Thursday, April 3, 2025

భర్త వేధించాడని పిఎస్‌కు వెళ్తే… ఆమెపై ఎస్‌ఐ అత్యాచారయత్నం

- Advertisement -
- Advertisement -

చెన్నై: తన భర్త వేధిస్తున్నడని పోలీస్ స్టేషన్‌కు వచ్చిన బాధితురాలను ఎస్‌ఐ లైంగికంగా వేధించిన సంఘటన తమిళనాడు రాష్ట్రం ధర్మపురి జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… 2020లో పళని స్వామి(28), బాలిక(17)ను పెళ్లి చేసుకున్నాడు. ఈ దంపతులకు రెండేళ్ల కుమారుడు ఉన్నాడు. 8 నెలల నుంచి దంపతుల మధ్య గొడవ జరగడంతో భార్య ఏరియూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఎస్‌ఐ సహదేవ్ ఆమెను లైంగికంగా వేధించాడు. తనపై ఫిర్యాదు చేస్తావా? అని భార్యపై భర్త దాడి చేశాడు. వెంటనే ఆమెను అధికారులు ప్రభుత్వ హోమ్‌కు  తరలించారు. బాల్యవివాహం చేసుకున్న పళనిస్వామి, ఆయన తల్లిదండ్రులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆమెను లైంగికంగా వేధించిన ఎస్‌ఐ సహదేవ్‌పై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు ఎస్‌ఐని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News