Friday, November 15, 2024

తమిళనాడు ఆస్పత్రిపై హ్యాకర్ల పంజా.. 1.5 లక్షల మంది రోగుల డేటా విక్రయం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ఢిల్లీలో ఎయిమ్స్ సర్వర్ల హ్యాకింగ్ వ్యవహారం తేలకముందే తమిళనాడు లోని శ్రీశరణ్ మెడికల్ సెంటర్ ఆస్పత్రికి చెందిన దాదాపు లక్షన్నర మంది రోగుల డేటాను ఆన్‌లైన్‌లో విక్రయించినట్టు తెలుస్తోంది. సైబర్ ముప్పులను అంచనా వేసే క్లౌడ్‌సెక్ అనే సంస్థ ఈ ఉదంతాన్ని బయటపెట్టింది.

2007-2011 మధ్య ఈ ఆస్పత్రికి వెళ్లిన రోగుల పేర్లు, పుట్టిన తేదీ, చిరునామా, గార్డియన్ పేరు, వైద్యుల వివరాలను హ్యాకర్లు సైబర్ క్రైమ్ ఫోరమ్‌ల్లో 100 డాలర్ల నుంచి 400 డాలర్ల చొప్పున విక్రయించినట్టు క్లౌడ్‌సెక్ వెల్లడించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News