Friday, December 20, 2024

ప్రియుడు మాట్లాడడంలేదని ప్రియురాలు ఆత్మహత్య… వీడియో పంపించి

- Advertisement -
- Advertisement -

చెన్నై: ప్రియుడు మాట్లాడడం లేదని విషం తాగిన వీడియో అతడికి పంపించి ప్రియురాలు ఆత్మహత్య చేసుకున్న సంఘటన తమిళనాడు రాష్ట్రం తిరుపత్తూరు జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. నాట్రంబల్లి గ్రామంలో శరణ్య(23) అనే యువతి ఎంఎ ఫస్ట్ ఇయర్ చదువుతోంది. అదే గ్రామానికి చెందిన అరుణ్ ప్రేమించింది. ఇద్దరు గాఢంగా ప్రేమించుకున్నారు. చిన్న చిన్న మనస్పర్థలు రావడంతో ప్రియుడు, ప్రియురాలు మాట్లాడుకోవడంలేదు. దీంతో తీవ్ర మనోవేదనకు గురైన శరణ్య తన కూల్ డ్రింక్‌లో విషం కలుపుకొని తాగి, ఆ వీడియో తన ప్రియుడికి పంపించింది. అపస్మారక స్థితిలో ఉన్న కూతురును తల్లిదండ్రులు ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శరణ్యం మృతి చెందింది. నాట్రంబల్లి గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News