Wednesday, January 22, 2025

విఆర్‌ఒను అడ్డంగా నరికిన ఇసుక మాఫియా

- Advertisement -
- Advertisement -

చెన్నై: ఇసుక మాఫియాను అడ్డుకున్న విఆర్‌ఒను ఆఫీస్‌లో అడ్డంగా నరికిన సంఘటన తమిళనాడు రాష్ట్రం తిరునల్వేలిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం….. మోరప్పనాడు గ్రామంలో లూర్ద్ ఫ్రాన్సిస్ అనే వ్యక్తి విఆర్‌ఒగా పని చేస్తున్నాడు. ఇసుక మాఫియా ఆగడాలకు విఆర్ఓ అడ్డుగా ఉన్నాడు. ఇద్దరు వ్యక్తులు లూర్ద్ పని చేస్తున్న ఆఫీస్‌లోకి ప్రవేశించి అతడిని అడ్డంగా నరికారు. అనంతరం ఘటనా స్థలం నుంచి నిందితులు పారపోయారు. వెంటనే స్థానికులు రక్తపు మడుగులో ఉన్న అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. హంతకులు అరెస్ట్ చేయాలని పోలీసులకు సిఎం ఎంకె స్టాలిన్ ఆదేశాల జారీ చేశారు. లూర్ద్ ఫ్రాన్సిస్ కుటుంబానికి కోటీ రూపాయల ఎక్స్‌గ్రేషియా ఇస్తామని తమిళనాడు సిఎం ఎంకె స్టాలిన్ హామీ ఇచ్చారు. ఈ ఘటనపై ప్రతిపక్ష పార్టీలు మండిపడుతున్నాయి.

Also Read: విరాట్-అనుష్క క్యూట్ డ్యాన్స్(వైరల్ వీడియో)

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News