Wednesday, January 22, 2025

బస్సులో వెళ్తున్న యువకుడిపై లైంగిక దాడి

- Advertisement -
- Advertisement -

చెన్నై: తమిళనాడు రాష్ట్రం తిరుచ్చి జిల్లాలో యువకుడిని బస్సులో నుంచి కిందకు దిచ్చి అతడిపై లైంగిక దాడి చేశారు. పోలీసులు ఆరుగురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. మణాప్పారైకు చెందిన ఓ యువకుడు (27) ఐటి కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పని చేస్తున్నాడు. ఐటి ఉద్యోగి పుత్తానందం నుంచి మణప్పారైకు బస్సులో వెళ్తున్నారు. వండపేటకు చెందిన అరివళగన్(27) కూడా అదే బస్సులో ఉండడంతో తన స్నేహితులకు ఫోన్ చేసి ఐటి ఉద్యోగితో గొడవ పడ్డానని ఇక్కడికి రావాలని కబురుపంపాడు.

Also Read: రంధి తీర్చిన ‘బంధు’

వెంటనే ఐదుగురు బస్సు వద్దకు చేరుకోగానే ఐటి ఉద్యోగిని బస్సు నుంచి నిర్మానుష్య ప్రదేశానికి లాక్కెళ్లారు. ఐదుగురు యువకుడిని పట్టుకోగా రియాజ్ (24) అనే వ్యక్తి అతడిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆ దృశ్యాలను వీడియో తీసి అతడి దగ్గర ఉన్న 75 వేల రూపాయలను లాక్కున్నారు. సాఫ్ట్‌వేర్ ఉద్యోగి స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. రియాజ్‌పై గతంలో లైంగిక వేధింపులకు పాల్పడినట్లు కేసులు ఉండడంతో పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News