ఢాకా: గల్ఫ్ వేదికగా అక్టోబర్‌లో జరిగే పురుషుల ట్వంటీ20 ప్రపంచకప్ నుంచి బంగ్లాదేశ్ ఓపెనర్ తమీమ్ ఇక్బాల్ తప్పుకున్నాడు. కొంతకాలంగా తాను టి20 క్రికెట్‌ను ఆడడం లేదని, ఇలాంటి స్థితిలో తన స్థానంలో మరో క్రికెటర్‌కు చోటివ్వాలనే ఉద్దేశంతో తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు. అయితే తాను టి20 ఫార్మాట్‌కు రిటైర్మెంట్ మాత్రం ప్రకటించడం లేదన్నాడు. వరల్డ్‌కప్ వంటి మెగా టోర్నీలో తనకంటే మెరుగైన ఆటగాడికి ఛాన్స్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపాడు. ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన టి20 సిరీస్‌కు కూడా తమీమ్ దూరంగా ఉన్నాడు. వన్డేలు, టెస్టుల్లో మాత్రం బంగ్లాదేశ్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఇక తాను వరల్డ్‌కప్‌కు దూరంగా ఉంటున్న విషయాన్ని తమీమ్ బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకు తెలిపాడు. తన స్థానంలో మరో ఆటగాడిని జట్టులోకి తీసుకోవాలని సూచించాడు. ఇదిలావుండగా షకిబ్, మహ్మదుల్లా, రహీమ్, ముస్తఫిజుర్‌లతో పాటు తమీమ్ బంగ్లాదేశ్ కీలక ఆటగాళ్లలో ఒకడిగా కొనసాగుతున్నాడు. ఓపెనర్‌గా బంగ్లాకు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించిన ఘనత తమీమ్‌కు దక్కుతుంది.
Tamim Iqbal out from ICC T20 World Cup