ఢాకా: బంగ్లాదేశ్ స్టార్ ఓపెనర్ తమీమ్ ఇక్బాల్ ఇంటర్నేషనల్ టి20లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. వెస్టిండీస్‌తో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ముగిసిన తర్వాత అతను తన నిర్ణయాన్ని వెల్లడించాడు. కాగా, తమీమ్ ఇక్బాల్ కెప్టెన్సీలో బంగ్లాదేశ్ మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను సునాయాసంగా గెలిచి వెస్టిండీస్‌ను 3-0తేడాతో క్లీన్ స్వీప్ చేసింది. ఈ సిరీస్లో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా తమీమ్ ఇక్బాల్ నిలిచాడు. ఇక మూడో వన్డే అనంతరం తమీమ్ తన నిర్ణయాన్ని తన అధికారిక ఫేస్‌బుక్ ఖాతాలో ప్రకటించాడు. 33ఏళ్ల తమీమ్ ఈ ఏడాది జనవరిలో బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుతో సంప్రదించిన తర్వాత టి20ల నుంచి రిటైర్మెంట్‌కు ప్లాన్ చేసుకున్నాడు. తమీమ్ 2007లో టీ20ల్లో అరంగేట్రం చేసిన తమీమ్ ఇక్బాల్ బంగ్లాదేశ్ తరఫున 78 టి20 ఇంటర్నేషనల్స్ మ్యాచ్‌లు ఆడి, 24.08 సగటుతో 116.9 స్ట్రైక్ రేట్‌తో 1758పరుగులు చేశాడు. అందులో 7 హాఫ్ సెంచరీలు, ఒక సెంచరీ కూడా ఉండడం విశేషం. అయితే వన్డే, టెస్టు ఫార్మాట్లలో తమీమ్ కొనసాగనున్నాడు.
Tamim Iqbal Retired from International T20Is