- Advertisement -
సవర్: ఢాకా ప్రీమియర్ లీగ్‌లో అనుకోని సంఘటన చోటు చేసుకుంది. సోమవారం సవర్ వేదికగా రెండు క్లబ్‌ల మధ్య జరిగిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్ తమీమ్ ఇక్లాల్‌కు తీవ్రస్థాయిలో గుండెపోటు వచ్చింది. దీంతో వెంటనే అతన్ని ఆస్పత్రికి తరలించారు. 36 సంవత్సరాల తమీమ్ మైదానంలోనే ఛాతీలో నొప్పితో కుప్పకూలిపోయాడు. దీంతో అక్కడ అతనికి ప్రాథమిక చికిత్స అందించి ఆ తర్వాత ఆస్పత్రికి తీసుకుపోయారు. ఆస్పత్రిలో తమీమ్‌కు ఇసిజి పరీక్ష నిర్వహించారని.. అతని ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో ఇప్పుడే చెప్పలేమని బిసిబి చీఫ్ ఫిజిషియన్ దెబాషీష్ చౌదరీ వెల్లడించారు. ప్రస్తుతానికి అతను వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. వైద్యులు తమీమ్ ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.
- Advertisement -