Monday, December 23, 2024

‘రాజకీయాల్లోకి రాకముందు మీ ఆస్తులెంత.. ఇప్పుడెంత?’: తమ్మారెడ్డి సవాల్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: సినీ ఇండస్ట్రీపై వైసిపి నేత నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ పలువురు సినీ నిర్మాతలు మండిపడుతున్నారు. ఈ క్రమంలో రాజకీయ నేతలకు నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ సవాల్ విసిరారు. ఎపి సినిమా టికెట్ల వివాదంపై బుధవారం ఓ మీడియా చానెల్ తో తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ.. ”దాసరిని రీప్లేస్ చేసే వ్యక్తి ఇండస్ట్రీలో ఎవరూ లేరు. ఏపిలో షూటింగ్ లొకేషన్ ఛార్జీలు తగ్గించారు.ఈ విషయంపై ఎవరూ ఎందుకు మాట్లాడడంలేదు. ఎపిలో సినిమా సమస్యలు త్వరలో పరిష్కారం అవుతాయి. ఇండస్ట్రీకి పెద్ద అనేది పదవి కాదు.. వారు చేసే పనులను బట్టే పెద్దరికం వస్తుంది. రాజకీయ నాయకులు బాధ్యతాయుతమైన పదవిలో ఉండి సినీ ఇండస్ట్రీని అవమానించేలా మాట్లాడడం తగదు. మేము కోట్లు పెట్టి పైసా పైసా ఏరుకుంటున్నాం. రాజకీయాల్లోకి రాకముందు మీ ఆస్తులెంత.. ఇప్పుడెంత?. ఆస్తుల మీద బహిరంగ చర్చకు సిద్ధమా?” అని తమ్మారెడ్డి సవాల్ విసిరారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News