Monday, January 6, 2025

అరుపులు, తొడ గొట్టడం సినిమాల్లో చెల్లుతాయి, రాజకీయాల్లో చెల్లవు: తమ్మినేని

- Advertisement -
- Advertisement -

అమరావతి: వాలంటీర్లపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై స్పీకర్ తమ్మినేని సీతారాం మండిపడ్డారు. వాలంటీర్ల సేవలు చేస్తుంటే ఉమెన్ ట్రాఫికింగ్‌కు పాల్పడుతున్నారనడం ఏంటి అని ప్రశ్నించారు. బుద్ధి ఉన్నవాడు ఎవడైనా అలా మాట్లాడతాడా? నీకు పిల్లలు ఉన్నారు కదా? అని తమ్మినేని ప్రశ్నించారు. ఇలాంటి మాటలు రెండు కాళ్ల జంతువులు బుర్రలేని పనికిమాలిన వ్యక్తులు మాత్రమే మాట్లాడుతారని దుయ్యబట్టారు. పవన్ పిచ్చిమాటలు, వెకిలీ చేష్టలు మానుకోవాలని హితువు పలికారు. అరుపులు, తొగ గొట్టడం ఏంటి… గుండు కొట్టిస్తానని అనడం ఏంటి అని తమ్మినేని ఎద్దేవా చేశారు. పనవ్ పరిణతి చెందని రాజకీయనాయకుడు అని, ఇలా అరుపులు, తొడ గొట్టడం సినిమాల్లో చెల్లుతాయని, రాజకీయాల్లో చెల్లవని చురకలంటించారు.

Also Read: రేవంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీ కవిత

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News