Wednesday, November 6, 2024

బిఆర్‌ఎస్‌కే బిజెపిని ఓడించే సత్తా

- Advertisement -
- Advertisement -

రాష్ట్రంలో 8,180 గ్రూప్ 4 పోస్టుల భర్తీకి జులై 1వ తేదీన (శనివారం) పరీక్ష నిర్వహించేందుకు టిఎస్‌పిఎస్‌సి ఏర్పాట్లు పూర్తి చేసింది. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనున్న గ్రూప్ 4 పరీక్షకు 9.51 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, శుక్రవారం రాత్రి వరకు 9,01, 051 మంది శాతం) అభ్యర్థులు హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకున్నారు. నేపథ్యంలో అ భ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కమిషన్ తగిన చర్యలు తీసుకుంటోంది. రాష్ట్రవ్యాప్తంగా 2,878 పరీక్ష కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో పరీక్ష విధానం ఎలా ఉండబోతుంది.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దానిపై కమిషన్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. మొత్తం 40వేల గదు ల్లో అభ్యర్థులు పరీక్ష రాయనున్నారు. పరీక్ష పారదర్శకంగా, సజావుగా నిర్వహించేందుకు టిఎస్‌పిఎస్‌సి లాంటిది. ప్రజలు దానిని గుర్తిస్తున్నారు.

మా స్ఫూర్తిని, ఐక్యతను ప్రజలు ఆదరించాల’ని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం చెప్పారు. ‘కష్టం వచ్చినా, నష్టం వచ్చినా కలిసుండాలని నిర్ణయించాం. మునుగోడు ఉప ఎన్నికల్లో బిజెపి విపత్తు నుంచి రాష్ట్రాన్ని కాపాడిన ఘనత సిపిఐ, సిపిఎంకు దక్కింది. దానిపై అనేక విమర్శలు వచ్చినా ప్రజలకు, ఇరు పార్టీల కార్యకర్తలకు బిజెపి ప్రమాదాన్ని వివరించి చెప్పాం. మంచి ఫలితం వచ్చింది. మునుగోడులో బిజెపి గెలిస్తే ఎంఎల్‌ఎల కొనుగోలుకు ఓ సాధనంగా ఉపయోగపడేది. రాష్ట్ర ప్రభుత్వం అస్థిరంగా మారే ప్రమాదంలో పడేది. కానీ మునుగోడు ఫలితం తర్వాత మమ్మల్ని విమర్శించిన వారు కూడా హర్షించార’ని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. హైదరాబాద్‌లోని సిపిఎం రాష్ట్ర కార్యాలయం ఎంబీ భవన్‌లో శుక్రవారం సిపిఐ, సిపిఎం రాష్ట్ర నాయకులు ఉమ్మడి సమావేశాన్ని నిర్వహించారు.
ఊహాగానాలపై నిర్ణయం తీసుకోలేం : తమ్మినేని
అనంతరం మీడియాతో తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో పొత్తులపై రకరకాల వార్తలు మీడియాలో వచ్చాయని చెప్పారు. బిఆర్‌ఎస్‌తో కమ్యూనిస్టులు ఇటీవల దూరమయ్యారని, కాంగ్రెస్‌తో జతకడతారంటూ ప్రచారం జరిగిందన్నారు. అవి పూర్తిగా నిరాధార ఆరోపణలని, దానిని ఖండిస్తున్నామన్నారు. ఎన్నికల్లో పొత్తులు రాజకీయ విధానాల ప్రాతిపదికన ఉంటాయి తప్ప ఓట్లు, సీట్ల ప్రాతిపదక కాదన్నారు. అఖిల భారత స్థాయిలో బిజెపిని ఓడించడమే తమ రాజకీయ విధానమని స్పష్టం చేశారు. దానికి అనుగుణంగానే రాష్ట్రంలోనూ ఆ విధానమే ఉంటుందన్నారు. బిఆర్‌ఎస్‌తో తమ మైత్రి ఆ ప్రాతిపదికన ఏర్పడిందని, ఇప్పటికీ అది కొనసాగుతున్నదని వివరించారు. బిజెపి వ్యతిరేకంగా ఉండటం, ఓట్లు చీలకకుండా ఉండేందుకే మునుగోడులో బిఆర్‌స్‌తో స్నేహంగా ఉన్నామని చెప్పారు. మద్దతివ్వాలంటూ కాంగ్రెస్ నుంచి ప్రతిపాదన వచ్చిందని గుర్తు చేశారు. బిజెపిని ఓడించే శక్తి బిఆర్‌ఎస్‌కు ఉందని అన్ని కమిటీల్లో చర్చించి నిర్ణయం తీసుకున్నామని వివరించారు.
బిఆర్‌ఎస్‌పై యూటర్న్ తీసుకోలేదు : కూనంనేని
పార్టీలో చర్చించి ఓ నిర్ణయం తీసుకున్నాక కార్యదర్శి ఏది పడితే అది మాట్లాడేది ఉండబోదని, ఆ నిర్ణయం మారబోదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు చెప్పారు. నిర్ణయం మారాలంటే కిందిస్థాయి నుంచి మళ్లీ చర్చించాల్సి ఉంటుందన్నారు. అయితే బిఆర్‌ఎస్‌పై యూటర్న్ తీసుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. పేదల కోసం పోరాడే కమ్యూనిస్టులు అసెంబ్లీ, పార్లమెంటులో ఉండాలన్నారు. బిజెపిని నిలువరించడంలో కమ్యూనిస్టులు ప్రధాన భూమిక పోషించారని చెప్పారు. సమావేశంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభదర, కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి, పోతినేని సుదర్శన్, జాన్‌వెస్లీ, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పల్లా వెంకట్‌రెడ్డి, కలవేణి శంకర్, హేమంత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News