Friday, January 10, 2025

ఖమ్మం జిల్లాలో మొదటగా ఓడిపోయేది భట్టి విక్రమార్క

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఖమ్మం జిల్లాలో మొదటగా ఓడిపోయేది భట్టి విక్రమార్క అని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. కాంగ్రెస్ ఓడిపోయే సీట్లలో మొట్టమొదటిది మధిరనే రాసుకోండి, సీపీఎంతో పొత్తు ఎందుకు పెట్టుకోలేదు అని భట్టి బాధపడతాడు తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో సీపీఎం ఒంటరిగానే పోటీ చేస్తుందని వీరభద్రం ప్రకటించారు. పొత్తు స్ఫూర్తిని నిలబెట్టుకోవడంలో బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌లు విఫలమై సీపీఎంను మోసం చేశాయని ఆరోపించారు.

బీజేపీని, దాని ప్రజావ్యతిరేక, మత రాజకీయాలను ఓడించేందుకు గత ఎన్నికల్లో సీపీఎం బీఆర్‌ఎస్‌కు మద్దతిచ్చిందని వీరభద్రం పేర్కొన్నారు. అయితే, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నుంచి ఎదురుదెబ్బ తగులుతుందనే భయంతోనే బీఆర్‌ఎస్ కూటమిని తిరస్కరించిందన్నారు. పాలేరు, వైరా, సూర్యాపేట సీట్ల కేటాయింపులకు సంబంధించి సీపీఎంకు కాంగ్రెస్ వాగ్దానాలు చేసిందని, వాటిని నెరవేర్చడంలో విఫలమైందన్నారు. సీపీఐతో స్నేహ బంధాన్ని కొనసాగించేందుకు కొత్తగూడెంలో పోటీ చేయకూడదని సీపీఎం నిర్ణయించినట్లు తెలిపారు. బీజేపీ దాదాపు 5 లేదా 6 సీట్లు గెలుచుకుంటుందని వీరభద్రం జోస్యం చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News