Sunday, December 22, 2024

ఓటు వేయలేకపోయిన పాలేరు అభ్యర్థి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం సిపిఎం అభ్యర్థి తమ్మినేని వీరభద్రం తన ఓటును వినియోగించుకోలేకపోయారు. అభ్యర్థిగా ఉండి తన ఓటు తానే వేసుకోలేకపోయారు. తమ్మినేని వీరభద్రానికి హైదరాబాద్‌లో ఓటు ఉంటే రద్దు చేసుకొని తన సొంత గ్రామం తెల్దారుపల్లికి మార్పించుకున్నారు. ఓటర్ ఐడి కార్డులో అడ్రస్ మారినా నియోజకవర్గం మారకపోవడంతో తమ్మినేని తన ఓటు హక్కును వినియోగించుకోలేకపోయారు. సాంకేతిక కారణాలతో ఓటు మార్పిడి జరగలేదని అధికారులు వెల్లడించారు.

సిపిఎం 19 స్థానాల్లో పోటీ చేస్తుండడంతో సానుకూల ఫలితాలు వస్తాయని తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు. తమినేని పాలేరు నుంచి బరిలో దిగగా కాంగ్రెస్ నుంచి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, బిఆర్‌ఎస్ నుంచి కందాల ఉపేందర్ రెడ్డి పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీతో సఖ్యత లేకపోవడంతో సిపిఎం, ఆ పార్టీ కలిసి పోటీ చేయలేదు. తొలుత మిర్యాలగూడ, వైరా రెండు అసెంబ్లీ ఇస్తామని కాంగ్రెస్ చెప్పినప్పటికి చివరలో మిర్యాలగూడ ఒక్క సీటు ఇస్తామని చెప్పడంతో సిపిఎం పొత్తు నుంచి వైదొలిగింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News