Saturday, April 12, 2025

తమ్మినేని వీరభద్రానికి అస్వస్థత…. హైదరాబాద్ కు తరలింపు

- Advertisement -
- Advertisement -

ఖమ్మం: సిపిఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అస్వస్థతతకు గురయ్యారు. ఛాతీలో తీవ్ర నొప్పి ఉందని తెలపడంతో ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి కుటుంబ సభ్యులు తీసుకెళ్ళారు.  లంగ్స్ ఇన్ ఫెక్షన్ తో పెరగడంతో గుండె వద్దకు నీరు చేరిందని వైద్యులు పేర్కొన్నారు. హాట్ బీట్ రేట్ తగ్గడంతో మెరుగైన వైద్య కోసం హుటాహుటిన హైదరాబాద్ కు తరలించారు. ప్రస్తుతం తమ్మినేని వీరభద్రం ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యుల ప్రకటించారు. సంక్రాంతి కావడం తో ఖమ్మం రూరల్ స్వగ్రామం తెల్దరుపల్లికి తమ్మినేని వీరభద్రం వచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News