Saturday, December 21, 2024

ధరణి పోర్టల్‌లో ట్యాంపరింగ్

- Advertisement -
- Advertisement -

Tampering on the Dharani portal

పాసు పుస్తకం ఉన్నా
పెండింగ్ మ్యుటేషన్‌గా దర్శనం

మీసేవ ఆపరేటర్ల హస్తంపై అనుమానాలు పలువురిని
అదుపులోకి తీసుకున్న పోలీసులు రాష్ట్రవ్యాప్తంగా పలు
జిల్లాలో ఇలాంటి సంఘటనలు.. అప్రమత్తమైన రెవెన్యూ
అధికారులు సిసిఎల్‌ఎకు సమాచారం చేరవేత
విచారణ ప్రారంభించిన ఉన్నతాధికారులు

మనతెలంగాణ/హైదరాబాద్: ధరణి పోర్టల్‌ను ట్యాంపరింగ్ చేశారు. అ యితే ట్యాంపరింగ్ చేసింది సైబర్ నేరగాళ్లా లేక మీసేవ ఆపరేటర్‌లా అ న్నది తేల్చాల్సి ఉంది. ప్రస్తుతం ట్యాం పరింగ్ వికారాబాద్ జిల్లా పూడూరు మండలంలో జరగ్గా దీనిపై స్థానిక పో లీసులు సైతం ఇప్పటికే విచారణ చేప ట్టారు. ట్యాంపరింగ్ కూడా కొత్త పాసు పుస్తకాలు ఉన్న రైతులకు జరిగినట్టు రెవెన్యూ అధికారులు, పోలీసులు గు ర్తించారు. సుమారు ఈ మండలంలో 30 నుంచి 40 మంది రైతులు ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటుండగా రాష్ట్ర వ్యాప్తంగా మరికొన్ని చోట్ల మీసేవలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్న ట్టు రెవెన్యూ అధికారుల దృష్టికి రావ డంతో వాటిపై రెవెన్యూ అధికారులు దృష్టి సారించినట్టుగా తెలిసింది. ధరణి రాకముందు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో జరిగిన భూముల కొనుగోళ్లకు సంబంధించి ఇబ్బందులు వస్తున్నాయని రెవెన్యూ అధికారులు పేర్కొంటుండగా, రైతులు మాత్రం ధరణి వచ్చాక మ్యుటేషన్ చేసుకున్న భూములకు కూడా ఇలాంటి ఇబ్బందులు తలెత్తాయని వారు ఆరోపిస్తున్నారు.

విషయం తెలిసింది ఇలా…

పట్టాదారు పాసు పుస్తకం ఉన్న రైతులు తమ భూములను అమ్మడానికి స్లాట్ బుక్ చేసుకునేందుకు మీసేవకు వెళ్లినప్పుడు అసలు విషయం బయటపడింది. తమ భూములను అమ్మడానికి స్లాట్ బుక్ చేసుకోవడానికి ప్రయత్నించగా ఆ రైతులకు సంబంధించిన భూమి మ్యుటేషన్ ఇంకా పెండింగ్‌లో ఉందని చూపెట్టడంతో పాటు స్లాట్ బుక్ కాలేదు. ఈ విషయాన్ని రైతులు స్థానిక రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్లగా ఇది ట్యాంపరింగ్ అయినట్టు గుర్తించడంతో పాటు ఈ విషయాన్ని పోలీసులకు చేరవేశారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు మీ సేవలో పనిచేసే సిబ్బందిని అదుపులోకి తీసుకోగా కొన్ని విషయాలు వారు బయటపెట్టినట్టుగా తెలిసింది. ఇలాంటి సంఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా జరిగినట్టు తెలియడంతో రెవెన్యూ అధికారులు వెంటనే ఈ విషయాన్ని సిసిఎల్‌ఏ కార్యాలయానికి సమాచారం అందించినట్టుగా తెలిసింది. ప్రస్తుతం పాసు పుస్తకాలు ఉన్న రైతులు తమ భూములను అమ్ముకోలేక ఇబ్బందులు పడుతున్నారు.

సిసిఎల్‌ఏలో దరఖాస్తు చేసుకుంటేనే…

సుమారు 15 రోజులుగా దీనిపై పోలీసులు సైతం విచారణ చేపట్టారు. ఈ అంశానికి సంబంధించి కలెక్టర్ కూడా ఏమీ చేయలేని పరిస్థితిలో ఉండడంతో రైతుల పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది. ప్రస్తుతం ధరణిపోర్టల్ పెండింగ్ మ్యుటేషన్ అని రాకుండా చేయాలన్నా, వేరే వ్యక్తులకు ఆ భూములను రైతులు అమ్ముకోవాలన్నా సిసిఎల్‌ఏ (హైదరాబాద్) కార్యాలయం వల్లే సాధ్యమని, హైదరాబాద్ వెళ్లి దరఖాస్తు పెట్టుకోవాలని ఆ మండల రెవెన్యూ అధికారులు రైతులతో పేర్కొంటున్నారు. దీంతో తాము సిసిఎల్‌ఏకు ఎలా వెళ్లాలి, ఎవరిని కలవాలన్న దానిపై రైతులు ఆందోళన చెందుతున్నారు. అయితే స్థానిక కొందరు మీసేవ ఆపరేటర్లతో కలిసి ఇలా చేశారని పలువురు రైతులు ఆరోపిస్తుండగా, రెవెన్యూ అధికారులు మాత్రం పోలీసుల విచారణలో ఏమీ జరిగిందన్న విషయం తెలిసే అవకాశం ఉందని వారు పేర్కొంటున్నారు.

ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతుల్లో కొందరి వివరాలు ఇలా….

1.పట్టాదారు పేరు కూరకుల శ్రీనివాస్ తండ్రి ఎల్లయ్యకు (ఖాతానెంబర్ 60489) వికారాబాద్ జిల్లా పూడూరు మండలం, చెన్‌గోముల్ గ్రామంలో సర్వేనెంబర్ 261/4/2లో 0.39 గుంటల భూమి ఉంది. ప్రస్తుతం ఆ భూమిని ఆయన వేరే వాళ్లకు విక్రయించే నిమిత్తం స్లాట్ బుక్ చేసుకోవడానికి ప్రయత్నించగా పెండింగ్ మ్యుటేషన్ (2200036262) అంటూ ధరణిలో వస్తుంది.

2.పట్టాదారు పేరు కూరకుల మధుసూదన్ తండ్రి పురుషోత్తమ్‌కు (ఖాతానెంబర్ 60488) వికారాబాద్ జిల్లా పూడూరు మండలం, చెన్‌గోముల్ గ్రామంలో సర్వేనెంబర్ 261/4/1లో 0.38 గుంటల భూమి ఉంది. ప్రస్తుతం ఆ భూమిని ఆయన వేరే వాళ్లకు విక్రయించే నిమిత్తం స్లాట్ బుక్ చేసుకోవడానికి ప్రయత్నించగా పెండింగ్ మ్యుటేషన్ (2200036259) అంటూ ధరణిలో వస్తుంది.

3.పట్టాదారు పేరు కె. వెంకటరామన్న తండ్రి నర్సింలుకు (ఖాతానెంబర్ 60198) వికారాబాద్ జిల్లా పూడూరు మండలం, చెన్‌గోముల్ గ్రామంలో సర్వేనెంబర్ 251బి/1/2లో 2 ఎకరాల భూమి ఉంది. ప్రస్తుతం ఆ భూమిని ఆయన వేరే వాళ్లకు విక్రయించే నిమిత్తం స్లాట్ బుక్ చేసుకోవడానికి ప్రయత్నించగా పెండింగ్ మ్యుటేషన్ (2200041480) అంటూ ధరణిలో వస్తుంది. ఇలా చాలామంది రైతుల రోజు మండల కార్యాలయం చుట్టూ తిరుగుతుండడంతో రెవెన్యూ అధికారులు ఏమీ చెప్పలేక ఇబ్బందులు పడుతున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News