Wednesday, December 25, 2024

తండేల్ నుంచి పవర్‌ప్యాక్డ్ యాక్షన్

- Advertisement -
- Advertisement -

యువ సామ్రాట్ నాగ చైతన్య నటిస్తున్న ‘తండేల్’ నుంచి ఫస్ట్ సింగిల్ బుజ్జి తల్లి విడుదలైన తర్వాత సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన ఈ ట్రాక్ మ్యూజిక్ చార్ట్‌లలో అగ్రస్థానంలో నిలిచి, మ్యూజికల్ హిట్ అయింది. నాగ చైతన్య, సాయి పల్లవి జోడిగా కనిపించిన బుజ్జి తల్లి మెలోడిక్ మాస్టర్ పీస్‌గా నిలిచి, సినిమా మ్యూజికల్ జర్నీకి మంచి ప్రారంభాన్నిచ్చింది. నాగ చైతన్య శనివారం పుట్టినరోజు జరుపుకున్నారు.

నాగ చైతన్యకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ, తండేల్ మేకర్స్ పవర్ ప్యాక్డ్ యాక్షన్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. చేతిలో బరువైన యాంకర్‌ను పట్టుకుని, వర్షపు తుఫాను మధ్య ఓడపై నాగ చైతన్య నిలబడి కనిపించారు. ఈ యాక్షన్ సీక్వెన్స్ సినిమాలో పెద్ద ఆకర్షణగా నిలవనుంది. నాగచైతన్య పొడవాటి జుట్టు, మాసీ గడ్డంతో రగ్గడ్ అవతార్ లో కనిపించారు. ఈ హీరో తండేల్ రాజు పాత్రను పోషించిన విధానం ఇండియన్ సినిమాలో చిరకాలం గుర్తుండిపోతుంది. అల్లు అరవింద్ సమర్పణలో ప్రతిష్టాత్మక గీతా ఆర్ట్ బ్యానర్‌పై బన్నీ వాస్ నిర్మించిన ఈ చిత్రాన్ని యదార్థ సంఘటనల స్ఫూర్తితో రూపొందించారు. ఫిబ్రవరి 7న తండేల్ సినిమా గ్రాండ్‌గా విడుదలవుతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News