Saturday, February 1, 2025

తండేల్ పెద్ద విజయం సాధించాలి

- Advertisement -
- Advertisement -

యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి హైలీ యాంటిసిపేటెడ్ మూవీ ‘తండేల్’. చందూ మొండేటి దర్శకత్వంలో మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో గీతాఆర్ట్ బ్యానర్‌పై బన్నీవాసు నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 7న ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదల కానుంది. శుక్రవారం బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ ఈ మూవీ హిందీ ట్రైలర్‌ను ముంబైలో లాంచ్ చేశారు. ఈ ఈవెంట్‌లో బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ మాట్లాడుతూ “తండేల్ ఫిబ్రవరి 7న వస్తుంది. అలాగే మా అబ్బాయి నటించిన సినిమా కూడా అదే రోజు వస్తుంది.

అయినా పర్లేదు ఈ సినిమా ట్రైలర్ లాంచ్ కి వస్తానని చెప్పాను. కథ బావుంటే ఎన్ని సినిమాలు అయినా ఆడియన్స్ చూస్తారు. తండేల్ ట్రైలర్ నాకు చాలా నచ్చింది. డైరెక్టర్ చాలా అద్భుతంగా తీశారు. ఈ సినిమా చాలా పెద్ద విజయం సాధించాలి”అని అన్నారు. యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య మాట్లాడుతూ “ఇది ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ. శ్రీకాకుళం వెళ్లి అక్కడ మత్స్యకారుల్ని కలుసుకోవడం జరిగింది. వాళ్ళు చెప్పిన సంఘటనలు విన్నప్పుడు ఈ సినిమా నాకు ఎంత ఛాలెంజింగ్‌గా ఉంటుందో అర్థమైంది. ఇలాంటి కథలు యాక్టర్స్‌కి చాలా అరుదుగా వస్తాయి. ఇలాంటి సినిమాలో పార్ట్ కావడం అదృష్టంగా భావిస్తున్నాను. చందు చాలా అద్భుతంగా సినిమాని తీశాడు”అని తెలిపారు.

నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ “తండేల్ నిజంగా జరిగిన కథ. వైజాగ్ తీర ప్రాంతంలోని కొందరు వ్యక్తులు చేపల వేటకు గుజరాత్ వెళ్లి పొరపాటున బోర్డర్ క్రాస్ చేసి పాక్ సైన్యం చేతిలో చిక్కుకొని జైలు పాలైనవారి కథ ఇది. దర్శకుడు చందు ఈ కథని అద్భుతంగా తీర్చిదిద్దాడు. జైలు సీన్స్, విలేజ్ సీన్స్, లవ్ స్టొరీ ఆడియన్స్ ని విశేషంగా ఆకట్టుకుంటాయి”అని తెలియజేశారు. డైరెక్టర్ చందూ మొండేటి మాట్లాడుతూ “ఇది బ్యూటీఫుల్ లవ్ స్టొరీ. రాజు అనే క్యారెక్టర్ కరాచీలో తన మనుషుల కోసం ఏం చేశాడనేది కూడా చాలా ఆసక్తికరంగా వుంటుంది”అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News