Monday, December 23, 2024

రేవంత్ రెడ్డి సమక్షంలో భారీగా చేరికలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీలో చేరికలు జోరందుకున్నాయి. గాంధీభవన్ లో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడి సమక్షంలో భారీగా చేరికలు జరిగాయి. తాండూరు మున్సిపల్ మాజీ ఛైర్ పర్సన్ సునీత కాంగ్రెస్ పార్టీలో చేరారు. అధికారంలోకి రాగానే 6 గ్యారంటీలు అమలు చేస్తామని రేవంత్ రెడ్డి వెల్లడించారు. కార్యకర్తలను కేసులతో ఇబ్బంది పెడితే ఊరుకోమని రేవంత్ వార్నింగ్ ఇచ్చారు.

తెలంగాణ డిజిపిని తొలగించాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోందని ఆయన పేర్కొన్నారు. 45 రోజుల అకుంఠిత దీక్షతో పనిచేస్తే అధికారం కాంగ్రెస్ దేనన్నారు. డిసెంబర్ 9న ఇందిరమ్మ రాజ్యం ఖాయమని రేవంత్ జోస్యం చేప్పారు. ఎన్నికలు దగ్గర పడుతుండడంతో పేరున్న నేతలు తమ క్యాడర్ తో ఒక పార్టీని విడిచి మరో పార్టీలోకి జంప్ అవుతున్న విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News