Sunday, December 22, 2024

మొక్కలు నాటిన సినీ నటుడు తనీష్

- Advertisement -
- Advertisement -

Tanish plants saplings in green india challenge

హైదరాబాద్: రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ఇండియా చాలెంజ్ లో బాగంగా జూబ్లీహిల్స్ జిహెచ్ఎంసి పార్క్ లో సినీ నటుడు తనీష్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా తనీష్ మాట్లాడుతూ గ్రీన్ ఇండియా చాలెంజ్ పాల్గొన్నందుకు సంతోషంగా ఉందని చెప్పారు. తెలంగాణలో గ్రీనరి పెంచేందుకు ప్రతి ఒక్కరు తమ వంతుగా మొక్కలు నాటలని కోరారు. ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేసినందుకు ఎంపీ సంతోష్ కుమార్ కి కృతజ్ఞతలు తెలియజేశారు. తనను అభిమానించే ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని తనీష్ పిలుపునిచ్చారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News