Wednesday, January 22, 2025

హైదరాబాద్‌లో రక్తదాన శిబిరాన్ని నిర్వహించిన తంజీమ్ ఫోకస్, టిఎస్ సిఎస్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : మిలాద్ ఉల్ నబీ సందర్భంగా ఇవ్వడంలోని స్ఫూర్తిని పెంపొందించేందుకు విశేష ప్రయత్నంగా, హైదరాబాద్‌లోని తంజీమ్ ఫోకస్ మరియు తలసేమియా మరియు సికిల్ సెల్ సొసైటీ(టిఎస్ సిఎస్) ఆధ్వర్యంలో మౌలానా డాక్టర్ అహ్సన్ అల్ హమూమీ సాహబ్ మార్గదర్శకత్వంలో స్వచ్ఛంద రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. అఫ్జల్‌గంజ్ లోని చారిత్రాత్మకమైన ఆసిఫియా స్టేట్ సెంట్రల్ లైబ్రరీ, జరిగిన ఈ శిబిరానికి అపూర్వ స్పందన లభించింది.

ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఈ కార్యక్రమం సాయంత్రం వరకు కొనసాగింది. దాదాపు 720 మంది వాలంటీర్లు రక్తదానం చేశారు. డాక్టర్ చంద్రకాంత్ అగర్వాల్ నేతృత్వంలోని TSCS, తంజీమ్ ఫోకస్ బృందాలు కార్యక్రమం విజయవంతం కావడానికి అవిశ్రాంతంగా పనిచేశారు. ఈ కార్యక్రమ ప్రాముఖ్యత గురించి మౌలానా డాక్టర్ అహ్సన్ అల్ హమూమీ సాహబ్ మాట్లాడుతూ, “మిలాద్ ఉల్ నబీ మానవాళికి కరుణ మరియు సేవ యొక్క విలువలను బోధిస్తుంది. రక్తదానం చేయడానికి కలిసి రావడం ద్వారా, మేము ఆ విలువలను ప్రతిబింబించాము, నిజమైన మార్పును తీసుకువస్తున్నాము. సమాజం నుండి వచ్చిన స్పందన పట్ల సంతోషంగా వున్నాము” అని అన్నారు.

TSCS ప్రెసిడెంట్ చంద్రకాంత్ అగర్వాల్ మాట్లాడుతూ.. “ఈ రక్తదాన శిబిరం తలసేమియా మరియు సికిల్ సెల్ వ్యాధితో బాధపడుతున్న వారికి సహాయం చేయడంలో సంఘం అంకితభావానికి నిదర్శనం. రక్తమార్పిడిపై ఆధారపడే రోగుల జీవితాలను రక్షించడంలో మరియు జీవన నాణ్యతను మెరుగుపరచడంలో ఈ దాతలు అందించిన తోడ్పాటు ప్రశంసనీయం” అని అన్నారు. మిలాద్ ఉల్ నబీ వేడుకలలో భాగంగా రక్తదాన శిబిరం నిర్వహించబడింది. తంజీమ్ ఫోకస్ మరియు TSCS రెండూ సమాజానికి సేవ చేయడం కొనసాగించడానికి భవిష్యత్తులో ఇటువంటి ప్రభావవంతమైన కార్యక్రమాలను నిర్వహించడానికి కట్టుబడి ఉంటాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News