Sunday, December 22, 2024

ట్యాంక్‌బండ్ నిండింది.. మనసు మురిసింది

- Advertisement -
- Advertisement -

మహబూబ్‌నగర్ బ్యూరో : కళకళలాడుతోంది. మనం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమా ల ఫలాలు మన కళ్లముందే కనిపిస్తుంటే ఆ సంతోషమే వేరు అలాంటి అనుభూతినే సోమవారం మ ంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఫీల్ అయ్యారు. గత రెండు రో జులుగా కురుస్తున్న వర్షాల కారణంగా మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని ట్యాంబ్ బండ్‌కు పెద్ద ఎత్తున వరద వచ్చి చేరుతోంది.

ట్యాంక్ బండ్ మరమ్మత్తుల తర్వాత డ్రైనేజ్ నీళ్లు రాకుండా అన్ని రకా ల జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రస్తుతం వర్షపు నీరు వచ్చి చేరడంతో ట్యాంక్ బండ్ కళకళలాడుతోంది. సోమవారం బీసీ బంద్ చెక్కుల పంపిణీ కోసం శి ల్పారామం వస్తున్న మంత్రి శ్రీనివాస్‌గౌడ్ జోరుగా వర్షం కురుస్తున్నా వాన నీటితో కళకళలాడుతోన్న ట్యాంక్‌బండ్ వద్ద కాసేపు ఆగి వరద పరిస్థితిని పరిశీలించారు.

వర్షపు నీటితో చెరువు నిండటం ఎంతో సంతోషాన్ని కలిగిస్తోందని త్వరలోనే చెరువు పూర్తిగా నిండుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ట్యాంక్ బండ్ పూర్తిగా నిండిన వెంటనే సెయిలింగ్ పోటీలను నిర్వహిస్తామని మంత్రి తెలిపారు. వాటర్ స్పోర్ట్ ద్వారా మహబూబ్‌నగర్‌లో జాతీయ స్థాయి క్రీడలను నిర్వహించేందుకు కృషి చేస్తామన్నారు.

బిసిలకు ఆర్ధిక సహాయం
వెనుకబడిన తరగతులలోని అత్యంత పేదవారికి అందిస్తున్న ఆర్థ్ధిక సహాయ కార్యక్రమం నిరంతరం కొనసాగుతుందని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డా. వి. శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. బీసీ కులాలలోని వెనకబడ్డ వారికి అందజేస్తున్న ఆర్థ్ధిక సహాయం పంపిణీ కార్యక్రమంలో భాగంగా సోమవారం ఆ యన మహబూబ్‌నగర్ శిల్పారామంలో రెండ విడ త కార్యక్రమం కింద 300 మంది లబ్దిదారులకు రూ. లక్ష చెక్కులను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా పే ద, బడుగు, బలహీన వర్గాల వారికి ఆర్ధిక సహా యం అందించాలన్న సదుద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేకర్‌రావు బీసీలకు ఆర్ధిక సహా యం అందించే కార్యక్రమాన్ని తీసుకువచ్చారని తెలిపారు. సమాజంలోని అన్ని వర్గాల వారు బాగుపడాలన్న ఉద్దేశంతో అత్యంత వెనుకబడిన వారికి వీటిని అందజేయడం జరుగుతున్నదని, కులవృత్తులలోని పేద వారికి లక్ష రూపాయలతో కుటుంబాలను పో షించుకునేందుకు అవకాశం కల్పించాలని తెలిపా రు.

జిల్లా కలెక్టర్ జి. రవి నాయక్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న వెనుకబడిన తరగతుల కులాల ఆర్ధిక స హాయ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. కాగా ఈ పథకం కింద జిల్లా వ్యాప్తంగా 900 మంది లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చే యగా, మహబూబ్‌నగర్ నియోజకవర్గంలో మొద టి విడతన 300 రెండవ విడతన 300 చెక్కులు పంపిణీ చేయడం జరిగింది.

జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు రాజేశ్వరగౌడ్, మున్సిపల్ చైర్మన్ కేసి నర్సిములు, వైస్ చైర్మన్ గణేష్, ఎంపీపీ సుధాశ్రీ, కౌన్సిలర్లు, ఇతర ప్రజా ప్రతనిధులు, జిల్లా బీసీ సంక్షేమ అధికారి ఇందిర తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News