Thursday, January 23, 2025

కారును ఢీకొన్న ట్యాంకర్: ఎనిమిది మంది దుర్మరణం

- Advertisement -
- Advertisement -

జైపూర్: ట్యాంకర్ ట్రక్ బోల్తాకొట్టి కారుపై పడటంతో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారని పోలీసులు తెలిపారు. ఈ రోడు ప్రమాదం జైపూర్‌-అజ్మీర్ హైవేలో జరిగిందన్నారు. రామ్‌నగర్ ఏరియాలో గురువారం మధ్యాహ్నం 12.30 ప్రాంతంతో దుర్ఘటన జరిగినట్లు సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు. ట్యాంకర్ ట్రక్ టైరు పేలడంతో బోల్తాపడిన ట్రక్ సమీపంలో వెళుతున్న కారుపై పడింది.

Also Read: రెజ్లర్లతో అర్థరాత్రి పోలీసు బలగాల కుస్తీ

ఈ ఘటనలో ముగ్గురు పిల్లలు, ఇద్దరు మహిళలుతో సహా ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. సంఘటన ప్రాంతంలోనే ఏడుగురు మృతిచెందగా ఒకరు ఆసుపత్రికి తీసుకువెళుతుండగా ప్రాణాలు కోల్పోయారని ఎఎస్‌ఐ రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. మృతుల్లో ఆరుగురిని హసీనా, ఇజ్రాయిల్, మురాద్, రోహినా, షకీలా, సోనుగా పోలీసులు గుర్తించారు. ఫాజీ నుంచి అజ్మీర్ యాత్రకు కారులో వెళుతుండగా ప్రమాదం జరగడంతో మృతి చెందారని ఎఎస్‌ఐ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News