- Advertisement -
ముంబై: ఇటీవల అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన సీనియర్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ స్థానంలో ముంబై యువ స్పిన్నర్ తనుష్ కొటియన్‌ను ఆస్ట్రేలియా సిరీస్‌కు ఎంపిక చేయనున్నట్టు తెలిసింది. ఆల్‌రౌండర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న కొటియన్ దేశవాళీ క్రికెట్‌లో అదరగొడుతున్నాడు. రంజీ ట్రోఫీలో ముంబైకి ప్రాతినిథ్యం వహించిన తనుష్ 502 పరుగులు చేయడమే కాకుండా 29 వికెట్లను పడగొట్టాడు. దీంతో అతని ప్రదర్శనను పరిగణలోకి తీసుకున్న భారత క్రికెట్ బోర్డు ఆస్ట్రేలియాతో జరిగే మిగిలిన రెండు టెస్టు మ్యాచ్‌లకు తనుష్ ఎంపిక చేయాలని నిర్ణయించినట్టు తెలిసింది. ఈ మేరకు జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. త్వరలోనే తనుష్ మెల్‌బోర్న్ బయలుదేరి వెళ్లనున్నట్టు తెలిసింది. అయితే దీనిపై ఇప్పటి వరకు బిసిసిఐ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.
- Advertisement -