Monday, December 23, 2024

సరస్సులో కూలిన టాంజానియా విమానం

- Advertisement -
- Advertisement -

 

డోడోమా: టాంజానియా విమానం ఒకటి ఆదివారం ఉదయం విక్టోరియా సరస్సులో కూలిపోయింది. ఆ విమానంలో 40 మంది ప్రయాణించారు. కాగా వారిలో 26 మందిని కాపాడారు. ఆ విమానం బుకోబా విమానాశ్రయానికి వెలుతుండగా ప్రమాదానికి గురైంది. ఆఫ్రికాలో విక్టోరియా సరస్సు అతి పెద్దది. ఈ విమాన ప్రమాదంలో ఎంత మంది చనిపోయారన్నది ఇంకా నిర్దారణ కాలేదు. తీర ప్రాంత నగరం దార్ ఎస్ సలామ్ నుంచి ఆ విమానం వచ్చిందని టాంజానియా విమానయాన సంస్థ ప్రెసిషన్ ఎయిర్ తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News