Wednesday, January 22, 2025

టాంజానియా దేశ యువతికి 12 ఏళ్ల జైలు శిక్ష

- Advertisement -
- Advertisement -

డ్రగ్స్ స్మగ్లింగ్‌‌కు సంబంధించిన కేసులో రంగారెడ్డి జిల్లా కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. టాంజానియా దేశానికి చెందిన ఓ యువతికి ఏకంగా 12 ఏళ్ల జైలు శిక్ష విధించింది. వివరాల ప్రకారం.. 2021లో టాంజానియాకి చెందిన ఓ యువతి ఆ దేశం నుండి మూడు కిలోల హెరాయిన్ హైదరాబాద్‌కు తీసుకువచ్చింది. శంషాబాద్ ఎయిర్ పోర్టులో దిగిన ఆ యువతి ప్రవర్తనపై అనుమానం వచ్చిన డిఆర్‌ఐ అధికారులు తనిఖీలు చేశారు.

యువతి వద్ద నుండి మూడు కిలోల హెరాయిన్ స్వాధీనం చేసుకున్నారు. సీజ్ చేసిన హెరాయిన్ విలువ దాదాపు రూ.19 కోట్ల ఉంటుందని అధికారులు వెల్లడించారు. హెరాయిన్ స్లగ్మింగ్ చేసిన యువతిపై కేసు నమోదు చేశారు. తాజాగా ఈ కేసుకు సంబంధించి రంగారెడ్డి జిల్లా కోర్టు తీర్పు వెలువరించింది. టాంజానియా దేశానికి చెందిన యువతికి 12 ఏళ్ల జైలు శిక్ష విధించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News