Sunday, December 22, 2024

ప్రియురాలి చేతులు విరగ్గొట్టి.. నడిరోడ్డులో గుండు కొట్టించిన భార్య

- Advertisement -
- Advertisement -

గాంధీనగర్: భర్తతో వివాహేతర సంబంధం పెట్టుకుందని ప్రియురాలని అతడి భార్య తన బంధువులతో కలిసి హాకీ కర్రతో దాడి చేసి అనంతరం నడిరోడ్డులో గుండు కొట్టించింది. ఈ సంఘటన గుజరాత్ రాష్ట్రం తాపి జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. లాల్ సింగ్ గమిట్- శోభ్నా గమిట్ అనే దంపతులు నివిస్తున్నారు. లాల్ సింగ్‌తో ఊర్మిళాబెన్ అనే మహిళ అక్రమ సంబంధం పెట్టుకుందని శోభ్నా గమిట్ ఆరోపణలు చేసింది. ఊర్మిళాబెన్ అనే మహిళ తన కూతురుతో కలిసి ఇంటికి వస్తుండగా శోభ్నా గమిట్ తన బంధువులతో కలిసి రెండు కార్లలో వచ్చి ఆమెను ఆపారు. శోభ్నా తన బంధువులతో కలిసి ఊర్మిళాబెన్‌పై హాకీ కర్రలతో దాడి చేసి చేతులు విరగ్గొట్టింది. అనంతరం నడిరోడ్డులో ఆమెకు గుండు కొట్టించింది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఆమెను ఆస్పత్రికి తరలించారు. చేతులు విరగడంతో తలకు బలమైన గాయాలు ఉన్నట్టు గుర్తించారు. బాధితురాలు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆరుగురిని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News