Monday, December 23, 2024

మార్చిలో తాప్సీ పెళ్లట! పెళ్లికొడుకు ఎవరో తెలుసా?

- Advertisement -
- Advertisement -

ప్రముఖ నటి తాప్సీ త్వరలో పెళ్లి చేసుకోబోతోందట. సోషల్ మీడియాలో ఆమె పెళ్లి గురించి వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. తన చిరకాల బాయ్ ఫ్రెండ్, ప్రముఖ బ్యాడ్మింటన్ ఆటగాడు మథియాస్ బోను తాప్పీ పెళ్లాడనున్నట్లు తెలుస్తోంది. వీరిద్దరూ గత పదేళ్లుగా రిలేషన్ షిప్ లో ఉన్నారు.

తాప్సీ-మథియాస్ ల వివాహం మార్చి చివరివారంలో ఉదయ్ పూర్ లో జరుగుతుందనీ, పెళ్లికి కుటుంబ సభ్యులను తప్ప బాలీవుడ్ సెలబ్రిటీలను ఎవర్నీ ఆహ్వానించడం లేదని తెలిసింది.

తెలుగులో ఝుమ్మంది నాదంతో ఎంట్రీ ఇచ్చిన తాప్సీ తర్వాత.. వస్తాడు నా రాజు, మిస్టర్ పర్ఫెక్ట్, వీర, మొగుడు, దరువు, గుండెల్లో గోదారి వంటి సినిమాల్లో నటించింది. ఆ తర్వాత అవకాశాలను వెతుక్కుంటూ బాలీవుడ్ చేరుకుంది. అమితాబ్, షారుఖ్ వంటి అగ్రనటులతో నటించి, తనకంటూ బాలీవుడ్ లో ఓ స్థానం ఏర్పరచుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News