- Advertisement -
హైదరాబాద్: బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం రాత్రి తుదిస్వాస విడిచిన ప్రముఖ సినీనటుడు నందమూరి తారకరత్న భౌతిక కాయం ఆదివారం హైదరాబాద్ చేరుకుంది. గత రాత్రి అంబులెన్స్‌లో బయలుదేరిన ఆయన భౌతికకాయం రంగారెడ్డి జిల్లా మోకిలలోని ఆయన నివాసానికి చేరుకుంది. తారకరత్నను చివరిసారిగా చూసేందుకు నందమూరి కుటుంబసభ్యులు, సన్నిహితులు, సినీ ప్రముఖులు మోకిలలోని నివాసానికి తరలి వెళ్తున్నారు. సోమవారం ఉదయం ఫిలింనగర్‌లోని ఫిలిం చాంబర్‌కు తరలించి సాయంత్రం నాలుగు గంటల వరకు అభిమానుల సందర్శనార్థం ఉంచుతారు. ఆ తర్వాత ఐదు గంటలకు మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు సమాచారం.
- Advertisement -