Monday, December 23, 2024

తారకరత్నానికి వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు: బాలకృష్ణ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తారక రత్నాన్ని పరామర్శించడానికి నటుడు జూనియర్ ఎన్‌టిఆర్, కల్యాణ్ రామ్ ఇద్దరు బెంగళూరు వెళ్లారు. తారకరత్నాన్ని ఎన్‌టిఆర్, రామ్ పరామర్శించారు. తారకరత్న నారాయణ హృదయాలయలో చికిత్స పొందుతున్నారు. తారకరత్న పరిస్థితి నిన్నటికంటే మెరుగ్గా ఉందని ఎంఎల్‌ఎ, నటుడు బాలకృష్ణ తెలిపారు. తారకరత్నానికి వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారని, వైద్య సేవలకు తారకరత్న స్పందిస్తున్నారని బాలకృష్ణ పేర్కొన్నారు. తారకరత్న కోలుకోవాలని అభిమానులు ప్రార్థించాలన్నారు. మొదటి రోజు యువగళంలో తారకరత్న పాదయాత్ర చేస్తుండగా కుప్పకూలిపోయాడు. వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించారు. గుండెపోటు రావడంతో కుప్పకూలిపోయాడని పరీక్షించిన వైద్యులు తెలపడంతో మెరుగైన వైద్యం కోసం బెంగళూరుకు తరలించిన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News