Wednesday, January 22, 2025

మెరుగైన చికిత్స కోసం విదేశాలకు తారకరత్న

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తీవ్ర అస్వస్థతతో బెంగళూరు నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నటుడు నందమూరి తారకరత్నకు మెరుగైన చికిత్స కోసం విదేశాలకు తీసుకెళ్ళాలనే ఆలోచనలో ఆయన కుటుంబ సభ్యులు ఉన్నట్లు టిటిడి సీనియర్ నేత అంబికా లక్ష్మీనారాయణ తెలిపారు. తాజాగా తారకరత్న మెదడుకు శస్త్రచికిత్స చేశారు. స్కాన్ రిపోర్టు వచ్చిన తర్వాత వైద్యుల సలహా మేరకు మొరుగైన వైద్యం కోసం ఆయనను విదేశాలకు తీసుకెళ్ళనున్నారు.

జనవరి 27న టిడిపి యువగళం యాత్రలో పాల్గొన్న తారకరత్న గుండెపోటుకు గురైన విషయం తెలిసిందే. గత ఏడు రోజులుగా తారకరత్నకు నారాయణ ఆసుపత్రి వైద్యులు చికిత్స అందిస్తూనే ఉన్నారు. అయినప్పటికీ ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. సీనియర్ నటుడు నందమూరి బాలకృష్ణ ఆసుపత్రి వద్ద ఉంటూ నిత్యం వైద్యులను సంప్రదిస్తూ అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News