Monday, December 23, 2024

తారకరత్న భార్య సంచలన కామెంట్స్…

- Advertisement -
- Advertisement -

నందమూరి తారకరత్న చనిపోయిన నెల రోజులకు ఆయన భార్య అలేఖ్య రెడ్డి సంచలన పోస్ట్ చేశారు. తారకరత్న మరణించి మార్చి 18నాటికి నెల రోజులు గడిచింది. తన పోస్టులో అలేఖ్య తారకరత్నతో పరిచయం, ప్రేమ, పెళ్లి విషయాలను వెల్లడించారు. “మన పెళ్లి నిర్ణయం అందరికీ దూరం చేసింది. మానసిక ఒత్తిడి, ఆర్థిక ఇబ్బందులకు గురిచేసింది. కొందరి ద్వేషాన్ని చూడలేక కళ్లకు గంతలు కట్టుకున్నాం. అయిన వాళ్ళే పదే పదే మనల్ని బాధ పెట్టారు. పిల్లలు పట్టాక మన జీవితం మారిపోయింది. నువ్వు రియల్ హీరో. మనం మళ్లీ కలుస్తామని ఆశిస్తున్నాను.”అని ఆమె పోస్టులో భావోద్వేగం బయటపెట్టారు.

పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్నందుకు ఎదురైన కష్టాలు వివరించారు. ఈ నేపథ్యంలో మామయ్య బాలకృష్ణ, పెదనాన్న విజయసాయి రెడ్డికి ఆమె ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. తారకరత్నతో అలేఖ్య రెడ్డికి రెండో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. తారక్ హీరోగా నటించిన నందీశ్వరుడు చిత్రానికి అలేఖ్య రెడ్డి కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేసినప్పుడు ఇద్దరికీ పరిచయం ఏర్పడి, అది ప్రేమకు దారి తీసింది. 2012లో అలేఖ్య రెడ్డిని తారకరత్న గుడిలో పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి ఉన్నారు. ప్రస్తుతం ఆమె పెట్టిన పోస్టు సామాజిక మాద్యమాల్లో వైరల్ అవుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News