Wednesday, January 22, 2025

విషమంగా తారకరత్న పరిస్థితి!

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: నందమూరి తారకరత్న పరిస్థితి విషమంగా మారినట్లు తెలుస్తోంది. ఆయనకు మూడు వారాలుగా బెంగళూరులోని నారాయణ హృదయాలయలో చికిత్స అందిస్తుండగా, ఆయన ఆరోగ్యం విషమంగా మారినట్లు తెలిసింది. ఎంఆర్‌ఐ స్కాన్‌లో ఈ విషయం బయటపడినట్లు తెలుస్తోంది. ఆయన వైద్యం కోసం విదేశీ వైద్యులు కూడా వచ్చారు.

తారకరత్న పరిస్థితి బాగా లేదని తెలిసి నందమూరి బాలకృష్ణ, ఇతర కుటుంబ సభ్యులు బెంగుళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రి చేరుకున్నారని సమాచారం. ఇదిలావుండగా ఈ రోజు సాయంత్రం 4.30 గంటలకు ఆసుపత్రి వర్గాలు తాజా హెల్త్ బులెటిన్ వెల్లడించే అవకాశం ఉందని కూడా సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News