Sunday, January 19, 2025

భారత రాయబారి సంధూ నెట్టివేత..

- Advertisement -
- Advertisement -

న్యూయార్క్ : స్థానిక న్యూయార్క్ గురుద్వారాకు వచ్చిన భారత రాయబారి తరణ్‌జిత్ సింగ్ సంధూను ఖలీస్థానీ మద్దతుదారులు అవమానించారు. గురునానక్ జయంతి నేపథ్యంలో గురుద్వారాకు సంధూ వచ్చినప్పుడు ఖలీస్థానీవాదులు ఆయనను చుట్టుముట్టి తోసేశారు. కెనడాలో ఖలీస్థానీ నేత హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యకు నువ్వే కారణమంటూ దూషించారు. అమెరికాలో ఉంటూ నిజ్జర్ హత్య చేయించావు. ఇప్పుడు ఇక్కడున్న పన్నూన్‌ను అంతమొందించేందుకు యత్నిస్తున్నావు అని ఆరోపిస్తూ ఖలీస్థానీ నినాదాలకు దిగుతూ వీరు ఆయనపై చేయిచేసుకునే ప్రయత్నం చేసి నెట్టివేశారు.

సంబంధిత ఘటన వీడియోలు ఇప్పుడు సామాజిక మాధ్యమంలో వెల్లడయ్యాయి. బిజెపి అధికార ప్రతినిధి ఆర్‌పి సింగ్ ఈ వీడియోలను షేర్ చేశారు. కెనడాలో నిజ్జర్ హత్య భారత్ కెనడాల మధ్య దౌత్యసంబంధాలను దెబ్బతీసింది. ఇటీవలే పన్నూన్ హత్యకు భారతీయ ఏజెంట్లు కుట్ర పన్నారని, దీనిని తమ ఇంటలిజెన్స్ వర్గాలు సకాలంలో గుర్తించాయని, కుట్రను విఫలం చేశాయని పేర్కొంటూ అమెరికా భారత్‌కు ఆక్షేపణ తెలిపింది. తమ దేశ పౌరుడిగా ఉన్న వ్యక్తిని చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటూ హత్య చేయాలని యత్నించడం తీవ్ర పరిణామం అవుతుందని పేర్కొంది. అయితే భారతదేశం దీనిపై స్పందించలేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News