Monday, December 23, 2024

టార్గెట్ 10

- Advertisement -
- Advertisement -

పది ఎంపి సీట్లు గెలుపే లక్షంగా పనిచేయాలి

మన తెలంగాణ/హైదరాబాద్/ఇబ్రహీంపట్నం: రాష్ట్రంలో వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో 10 ఎంపి సీ ట్లు గెలుపే లక్ష్యంగా పనిచేయాలని పార్టీ శ్రేణులకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా  పేర్కొన్నారు. దేశంలో ప్రతి కార్యకర్త పార్టీ కోసం కష్టపడి పనిచేస్తే 400పైగా ఎంపీ స్థానాలు గెలుస్తామని ధీమా వ్య క్తం చేశారు. గురువారం కొంగర కలాన్‌లోని శ్లోక కన్వేషన్‌లో నిర్వహించిన బిజెపి రాష్ట్ర విస్తృతస్థాయి సమావేశంలో అసెంబ్లీ ఫలితాలు, వచ్చే పార్లమెం టు ఎన్నికల్లో  అనుసరించాల్సిన వ్యుహాలు, వికసిత్ భారత్ సంకల్స యాత్ర, అయోధ్యలో రామ మందిర ప్రాణ ప్రతి ష్ఠ అంశాలపై రాష్ట్ర పార్టీ నేతలతో సమీక్షించారు. అనంతరం మాట్లాడుతూ గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ కేవలం ఒక్క సీటు మాత్రమే గెలిచిన, మొన్న జరిగిన ఎన్నికల్లో ఊహించని విధంగా 8 సీట్లు సాధించామని హర్షం వ్యక్తం చేశారు.

ఈ ఎన్నికల్లో అధికారంలోకి వస్తామని, ఖచ్చితంగా 64 నుంచి 95 సీట్లు రావచ్చని జోస్యం చెప్పారని నాయకులకు చురుకలు వేశారు. ఎంపి సీట్లలో సిట్టింగ్ మరోసారి అవకాశముందని, మిగతా చోట్ల సర్వే నిర్వహించి వాటి ఆధారంగా అభ్యర్థులు ముందుగానే ప్రకటిస్తామని పేర్కొన్నారు. ఈ సమావేశానికి మండల అధ్యక్షుడి నుంచి జాతీయ స్థాయి నేతలు హాజరైయ్యారు. గత ప్రభుత్వం రాష్ట్రంలో పెద్ద ఎత్తున అవినీతికి పా ల్పడిందని ఆరోపించారు. మాదిగ సమాజానికి న్యాయం చేస్తున్న ఏకైక పార్టీ తమ పార్టీనేనని 25 శాతానికి పైగా ఓట్లు 10కి పైగా ఎంపీ సీట్లే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పార్టీ నాది అనుకుని పనిచేయాలన్నారు. సమావేశంలో వచ్చే ఎన్నికల్లో మోదీ విజయం చారిత్రక అవసరమనే తీర్మానం మాజీ మంత్రి డికె అరుణ ప్రవేశపెట్టగా సమావేశంలో అందరూ ఆమోదించారు. వర్గ విభేదాల కారణంగా పార్టీ తెలంగాణలో నష్టపోయిందని ఇక నుంచి ఎలాంటి విభేదా లు లేకుండా కలిసి పని చేయాలని పార్టీ నేతలకు కేంద్రమంత్రి అమిత్ షా హెచ్చరించారు. ఈ అసెం బ్లీ ఎన్నికల ఫలితాలు నిరాశను కలిగించాయని, అనుకున్న సీట్లు సాధించలేదని, 30 సీట్లు వస్తాయని ఆశిస్తే అందులో సగం గెలువలేదని ఆందోళన వ్యక్తం చేశారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో సమన్వయంతో పని చేయాలని పేర్కొన్నారు.

సిట్టింగ్ ఎంపిల సీట్లు పదిలం
నలుగురు సిట్టింగ్ ఎంపిలకు మరోసారి అవకాశం ఇస్తామని అమిత్‌షా ప్రకటించారు. సిట్టింగ్ ఎంపీ లు అదే స్థానం నుంచి పోటీ చేయాలని సూచించారు. నోవాటెల్ హోటల్‌లో ముఖ్య నాయకులతో జరిగిన సమావేశంలో ఆయన ఈ వివరాలు వెల్లడించారు. దీంతో నిజామాబాద్ నుంచి అర్వింద్, సికింద్రాబాద్ నుంచి కిషన్ రెడ్డి, కరీంనగర్ నుంచి బండి సంజయ్, ఆదిలాబాద్ నుంచి సోయం బాపురావు బరిలో దిగడం ఖరారైంది. రాష్ట్ర నాయకులు అంతర్గత వివాదాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సొంత ప్రయోజనాలను పక్కన పెట్టాలని ఎట్టి పరిస్ధితిలో మీడియాకు లీకులు ఇవ్వవద్దని నేతలకు సూచించారు. సోషల్ మీడియాలో పరస్పర ఆరోపణలు చేసుకోవడం సరికాదన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News