Wednesday, January 22, 2025

టార్గెట్ 15

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: పార్లమెంట్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపు గు ర్రాల ఎంపికపై కసరత్తు ప్రారంభించింది. దీనికి సంబంధించి మంగళవారం సాయంత్రం గాంధీ భవన్‌లో టిపిసిసి ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ ( పిఇసి) సమావేశం జరిగింది.హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో పిసిసి అధ్యక్షుడు, సిఎం రేవంత్ రెడ్డి అ ధ్యక్షతన ప్రదేశ్ ఎన్నికల కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క, ఏఐసిసి ప్రధాన కార్యాదర్శి తెలంగాణ ఇ న్‌చార్జ్ దీపాదాస్ మున్షీ, స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ హరీష్ చౌదరి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పి ఇసి సభ్యులు పాల్గొన్నారు.

వీరంతా లోక్‌సభ అ భ్యర్థుల ఎంపికపై చర్చించారు. పార్లమెంట్ అ భ్యర్థి టికెట్ కోసం ఇప్పటికే 309 మంది దరఖా స్తు చేసుకోగా కమిటీ సభ్యులు ఒక్కో పార్లమెంట్ సీటుకు ప్రాధాన్యత పరంగా దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఓటు వేసే అవకాశం ఉందని కాం గ్రెస్ వర్గాలు తెలిపాయి. వడపోత కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గాల వారీగా ముగ్గురు లే దా ఐదుగురు ప్రధాన నేతల పేర్లను పరిశీలన చే సి, అర్హులైన వారిని ఈ కమిటీ ఎంపిక చేయనుం ది. అదే విధంగా పార్టీ ఎన్నికల కార్యాచరణపైనా ఈ భేటీ లో చర్చించినట్టుగా తెలిసింది. ఇతర పార్టీల నుం చి వచ్చే వారిని పార్టీలోకి తీసుకోవాలని ఈ సమావేశంలో తీర్మానించింది. కాళేశ్వరంలో జరిగిన అవినీతిపై ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఈ విషయంలో పార్టీ ముఖ్య నేతలు అస్సలు తగ్గొద్దంటూ సభ్యులకు సిఎం రేవంత్ రెడ్డి పలు కీలక సూచనలు చేసినట్టుగా సమాచారం. దీంతోపాటు గోదావరి, కృష్ణాలకు సంబంధించిన ప్రాజెక్టులను బిఆర్‌ఎస్ నేతలు తెరపైకి తీసుకొచ్చి కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిని పక్కదారి పట్టిస్తున్నారన్న ఈ విషయాన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సభ్యులకు సూచించినట్టుగా తెలిసింది. కాళేశ్వరం కుంగిపోవడాన్ని సీరియస్‌గా తీసుకోవాలని, ఆ ప్రాజెక్టులో జరిగిన అవినీతి గురించి పూర్తి వివరాలను ప్రజలకు తెలియచెబితే బాగుంటుందని పార్టీ నేతలకు సిఎం రేవంత్ సూచించినట్టుగా సమాచారం. 2 లక్షల మందితో నల్లగొండ పార్లమెంట్ పరిధిలో సభ పెట్టాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కోరగా ఈ సభకు కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీని పిలవాలని నిర్ణయించినట్టుగా తెలిసింది. కష్టపడి 15 సీట్లకు తగ్గకుండా ఎంపి సీట్లు గెలవడానికి కృషి చేయాలని రేవంత్ సభ్యులకు సూచించినట్టుగా సమాచారం. దీంతోపాటు కులగణన చేయాలని నిర్ణయించడంపై కమిటీ హర్షం వ్యక్తం చేసింది. ఇక దరఖాస్తు ఫాంలో ఓసి స్థానంలో రెడ్డి, వెలమ, కమ్మ ఉండగా, బిసి స్థానంలో కొన్ని కులాల పేర్లు ఉండడం వల్ల దరఖాస్తు చేసుకున్న వారు ఇబ్బందులు పడ్డారని అలా కాకుండా ఓబిసి అని పెడితే బాగుండేదని, దీనిని ఓబిసిలోని మిగతా కులాలు అభ్యంతరం తెలుపుతున్నాయని విహెచ్ సూచించినట్టుగా తెలిసింది. దరఖాస్తు ఫాంలో ఓబిసి అని పెడితే నియోజకవర్గాల వారీగా ఓబిసిల సంఖ్య తెలిసేదని ఆయన సూచించినట్టుగా సమాచారం.
సోనియాను పోటీలో నిలబెట్టాలని ఏకవాక్య తీర్మానం
ముందుగా తెలంగాణ నుంచి సోనియా గాంధీ పోటీ చేయాలని ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ ఏక వాక్య తీర్మానం చేసింది. 17 పార్లమెంట్ స్థానాల కోసం 309 మంది ఆశావహుల పేర్లతో 32 పేజీల బుక్‌లెట్‌ను గాంధీ భవన్ సిబ్బంది పిఇసి సభ్యులకు అందించారు. ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ సభ్యులు ఇష్టం ఉన్న ఆశావహుల ముగ్గురు పేర్లను బుక్‌లెట్‌లో టిక్ చేసి ఒక్కో సభ్యుడు వివరాలను సీల్డ్ కవర్‌లో పెట్టి నేడు మధ్యాహ్నంలోగా గాంధీభవన్‌లో ఇవ్వాలని ఈ సమావేశం నిర్ణయించింది. ఒక్కో పార్లమెంట్ స్థానం నుంచి ముగ్గురు నుంచి ఐదుగురి మధ్యే ప్రధాన పోటీ నెలకొందని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి.
మహబూబాబాద్ సీటు కోసం 47 మంది దరఖాస్తు
దరఖాస్తు చేసుకున్న వారిలో పార్టీ నాయకులతో పాటు అధికారులు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ఉన్నారు. కొంతమంది అధికారులుగా కొనసాగుతూనే ఎంపి టికెట్ కోసం దరఖాస్తు చేసుకోగా మరికొందరు పదవీ విరమణ పొందిన అధికారులు సైతం దరఖాస్తు చేసుకోవడం విశేషం. పదిహేడు నియోజకవర్గాలకు సగటున ఒక్కో స్థానానికి 18 మందికి పైగా కాంగ్రెస్‌లో టికెట్ కోసం పోటీపడుతున్నారు. ఇందులో అత్యధికంగా ఎస్టీ రిజర్వు స్థానమైన మహబూబాబాద్ నుంచి 47 మంది దరఖాస్తులు చేసుకోగా, వరంగల్ టికెట్ కోసం 40 మంది, పెద్దపల్లి నియోజకవర్గానికి 29 మంది, భువనగిరి నుంచి 28 మంది దరఖాస్తు పెట్టుకున్నారు. అతి తక్కువ దరఖాస్తులు వచ్చిన నియోజకవర్గాల్లో మహబూబ్‌నగర్ టికెట్ కోసం కేవలం నలుగురు మాత్రమే ముందుకు రాగా జహీరాబాద్ నుంచి ఆరుగురు దరఖాస్తు చేసుకున్నారు. సికింద్రాబాద్ నుంచి కోదండరెడ్డి, అనిల్‌కుమార్ యాదవ్, ఫిరోజ్‌ఖాన్, చార్టెడ్ అకౌంటెంట్ వేణుగోపాలస్వామి దరఖాస్తు చేసుకున్నారు. నల్గొండ నుంచి పటేల్ రమేష్ రెడ్డి, రఘువీర్ రెడ్డి, సర్వోత్తమరెడ్డి, భువనగిరి నుంచి చామల కిరణ్‌కుమార్ రెడ్డి, బండ్రు శోభారాణి, డాక్టర్ సూర్య పవన్‌రెడ్డి, కైలాస్ నేత, బండి సుధాకర్‌లు అర్జీ పెట్టుకున్నారు. నాగర్‌కర్నూల్ నుంచి మల్లు రవి, మందా జగన్నాథం, చారకొండ వెంకటేష్, సంపత్‌కుమార్, పెద్దపల్లి నుంచి గడ్డం వంశీ, ఎ.చంద్రశేఖర్, పెరికి శ్యాం, మెదక్ నుంచి ఎం.భవానీరెడ్డి శ్రీకాంత్, చెరుకు శ్రీనివాస్‌రెడ్డి దరఖాస్తు చేసుకున్నారు. అలాగే చేవెళ్ల నుంచి భీం భరత్, చిగురింత పారిజాతరెడ్డి, మల్‌రెడ్డి రాంరెడ్డి, కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి, మల్కాజిగిరి నుంచి సినీ నిర్మాత బండ్ల గణేష్, హరివర్ధన్ రెడ్డి, సర్వే సత్యనారాయణ జహీరాబాద్ నుంచి సురేష్ షట్కర్, నిజామాబాద్ నుంచి ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, ఇరవత్రి అనిల్‌కుమార్, కరీంనగర్ నుంచి ప్రవీణ్‌కుమార్ రెడ్డి, ఆకారపు భాస్కర్ రెడ్డి, కటకం మృత్యుంజయం, రుద్ర సంతోష్‌లు టికెట్‌ల దరఖాస్తు చేసుకున్నారు. వరంగల్ నుంచి సిరిసిల్ల రాజయ్య, హరికోట్ల రవి, ఖమ్మం నుంచి మల్లు నందిని, రేణుకాచౌదరి, పొంగులేటి ప్రసాద్ రెడ్డి, పార్టీ సీనియర్ నేత విహెచ్‌లు దరఖాస్తు చేసుకున్నారు. మహబూబ్ నగర్ నుంచి చల్లా వంశీచందర్ రెడ్డి , సీతాదయాకర్ రెడ్డి, ఆదిలాబాద్ నుంచి నరేశ్ జాదవ్, మహబూబాబాద్ నుంచి బలరాంనాయక్, కెసి రాంనాయక్‌లు టికెట్ కోసం పోటీ పడుతున్నారు. హైదరాబాద్ (జనరల్) పార్లమెంట్ స్థానం నుంచి సమీరుల్లా, సూరం దినేష్, ఆనంద్ రావులు పోటీ పడుతున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News